ఉదయాన్నే ఇంట్లో ఉండే పని చెయ్యని వస్తువులని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను... ఇలా పని చెయ్యని దోమలు చంపే బ్యాట్ + ఒక పని చెయ్యని టార్చిలైట్ కనిపించాయి.. వెంటనే ఆలోచన తట్టింది. రెండింటిని కలిపి ఒక పనిచేసే వస్తువు చెయ్యచ్చుకదా అని.... వెంటనే పని ప్రారంభించాను... అరగంటలో ఇలా చేసేసాను.... ఆ పనిచెయ్యని బ్యాట్ లో ఉన్న బ్యాటరీని వాడి...ఈ పనిచెయ్యని టార్చిలైట్ ని వెలిగించాను...
ఆ...... ఏముంది..దాని వైర్లు తీసి దీనికి పెట్టాను అని అనుకుంటున్నారేమో... కాదండి... బ్యాట్ లోని నెట్ కి వచ్చేది AC (ఆల్టర్ నేటివ్ కరెంట్)..అంటే దానిలో బ్యాటరీ (DC) నుండీ AC కి మార్చే యూనిట్ ఉంటుంది...జాగ్రత్తగా ఆ యూనిట్ కు supply వెళ్ళకుండా సర్కూట్ బ్రేక్ చేసి + ఇంకొన్ని మార్పులు చేసి ఇలా చేసాను.. ఇక చక్కగా చార్జింగ్ పెట్టుకోవడం..వాడుకోవడం అంతే... బాగుందా?
మీ డౌట్ నాకు అర్దమైంది ఇంతకూ అది వెలుగుతుందా లేదా అనే కదా ?
కావాలంటే చూడడండి బాగానే వెలుగుతుంది...
ఇలాంటివి చిన్నప్పుడు చాలా చేసే వాడిని.... ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చాక దీనికే అతుక్కుపోవడం వల్ల కొంచెంతగ్గాయి.... నిజానికి అసలు ఆ బ్యాటరీ వాడి పాత మెబైల్ బాగు చెయ్యాలని అనుకున్నాను కానీ టాటా ఇండికాం పుణ్యమా అని ఏ సిమ్‍కార్డు పని చెయ్యడం లేదు..ఇక దానికి చేసిన వేస్టు అని ఇలా చేసాను...
ఇంతకూ నా క్రియేషన్ ఎలా ఉంది ?