May 9, 2012

నీ చిరునవ్వే నా గమ్యం నేస్తం


ఓ నేస్తం...

భారమైన నా హృదయానికి ఓదార్పు నీ స్నేహం
అశాంతితో నిండిన నా మనసుకు ఆదరింపు నీ స్నేహం
ఆవేదనతో రగులుతున్నప్పుడు ఓ చల్లని పలకరింత నీ స్నేహం
ప్రవాహంలా జాలువారే నా కన్నీటికి ఓ అడ్డుకట్ట నీ స్నేహం
అలసిన నా కన్నులలో కమ్మని కల నీ స్నేహం


అస్తమిస్తున్న నా జీవితానికి వెలుగునుచూపిన సూర్య కిరణం నీవు


అందుకే  ఓ నేస్తం నీ చిరునవ్వే నా గమ్యం

నా పెదవులపై ఈ దరహాసం విరిసిందీ నీ కోసమే..
కానీ నా నవ్వుకూ నీ నవ్వుకూ చిన్న తేడా ఉంది నేస్తం


నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతావు
నేను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాను


కమ్మని కలల్లా క్షణకాలమే మిగిలే ఈ జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక గుర్తువునీవు....
నన్ను మరు(విడు)వకు  నా నేస్తం ఎన్నటికీ....
మిగిలిపోతా నీ స్నేహం అనే సముద్రంలో ఒక బిందువులా..............


--సాయి



7 comments:

  1. సాయి గారు....సూపర్..
    వర్ణనాతీతం గా ఉంది మీ కవిత.చాలా చాలా చాలా బాగుంది.
    ఇంత మంచి నేస్తన్ని ఏ నేస్తం వదులుకోరు,మరచిపోరు అండీ...!!!
    ఇంత మంచి కవిత చదవడం స్నేహం గురించి ఆనందం గా ఉంది...మీ గమ్యాన్ని తప్పక చేరాలని ఆశిస్తూ .....

    ReplyDelete
  2. వర్ణనాతీతం గా ఉంది అంటే ultimate గా ఉందీ అని అర్ధం చేసుకొగలరు.

    ReplyDelete
    Replies
    1. సీత మీకు అనేక ధన్యవాదాలు అండి..... మీ లాగా నేనేం కవిని కాదు...... అసలు కవిత అంటేనే తెలియదు, నా నేస్తం నాకు చేసిన దానికి కృతజ్ఞతగా నాలుగు మాటలు రాస్తే ఇలా తగలడింది.... అంతే......

      Delete
  3. నేస్తం గురించి మదిలో పొంగే భావాలకి అక్షర రూపం ఇస్తే అది తప్పక అద్భుత కవిత అవుతుంది అని మీరు రాసిన నాలుగు మాటలే నిరూపించాయి.
    చాలా చక్కగా రాశారు. మీ నేస్తం మిమ్ములని విడువక తుది గమ్యం వరకూ మీతో సాగాలని ఆశిస్తూ...

    ReplyDelete
  4. చిన్ని ఆశ గారు.. ధ్యాంక్యూ వెరీమచ్ అండి.. చాలా రోజులు తరువాత నా బ్లాగుకు విచ్చేసినందుకు...... ధన్యవాదాలు....

    ReplyDelete
  5. స్నేహ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

    ReplyDelete
  6. స్నేహ భావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...