volume -1 Page-168
కీర్తన - 251
రాగం - ముఖారి
Download
బురదలో కాలు పెట్టడం ఎందుకు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు ? అంతంలేని ఈ జన్మసాగరాన్ని ఈదడం అసాధ్యం. వేంకటేశ్వరుడు కర్త. అతని సంకల్పమే మనసు.. మనసు మదాన్ని పెంచుతుంది. మదం తాపానికి హేతువు, తాపం దు:ఖాన్ని కలిగిస్తుంది. దీనికి లంపటం కారణం, లపటం వల్ల కోరికలు ఉదయిస్తాయి అవి ఆశలు రేపుతాయి. ఆశలు మమతలకు దారితీస్తాయి మమతలు సకల దురితాలకూ మూలం. ఆత్మేశ్వరుడైన వేంకటేశ్వరుని దీనికి కర్తగా భావించి, సేవించి, జీవన్ముక్తులు కావడమే వివేకం....
కడునడుసు చొరనేల కాళ్ళు కడుగనేల
కడలేని జన్మసాగర మీదనేల ||
కడలేని జన్మసాగర మీదనేల ||
దురితంబులనెల్లతొడవు మమకారంబులు
అరిదిమమతలకు దొడ వడియాసలు |
అరిదిమమతలకు దొడ వడియాసలు |
గురుతయిన ఆసలకు గోరికలు జీవనము
పరగ నిన్నిటికి లంపటమె కారణము ||
పరగ నిన్నిటికి లంపటమె కారణము ||
తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ
ముదుటయినతాపమున కుండగ చోటు |
పదిలమగు తాపంబు ప్రాణసంకటములు
ఈ మదము పెంపునకు తనమనసు కారణము ||
వెలయు తనమనసునకు వేంకటేశుడు కర్త
బలిసి ఆతనిదలచుపనికి తాకర్త |
బలిసి ఆతనిదలచుపనికి తాకర్త |
తలకొన్న తలపులివి దైవమానుషముగా
దలచి ఆత్మేశ్వరుని తలపంగ వలదా ||
దలచి ఆత్మేశ్వరుని తలపంగ వలదా ||
Lyrics in Englilsh:
kaDunaDuma coranEla kALLu gaDuganEla | kaDalEni janmasAgara mIdanEla ||
duritaMbulanelladoDavu mamakAraMbu- | laridimamatalaku doDa vaDiyAsalu |
gurutayina yAsalaku gOrikalu jIvanamu | paraga ninniTiki laMpaTame kAraNamu ||
tudalEni laMpaTamu duHKahEtuvu duHKa- | muduTayinatApamuna kuMDaga jOTu |
padilamagu tApaMbu prANasaMkaTamu lI- | madamu peMpunaku danamanasu kAraNamu ||
velayu danamanasunaku vEMkaTESuDu garta | balisi yAtanidalacupaniki dAgarta |
talakonna talapulivi daivamAnuShamugA | dalaci yAtmESvaruni dalapaMga valadA ||
వివరించి చాలా బాగా చెప్పారు.మంచి కీర్తన .చాలా బాగుంది
ReplyDeleteధ్యాంక్యూ సీతగారు....
Delete