ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం ( ప్రేమ ). ఎప్పుడూ అతనుండే ప్రదేశాలకు వెళ్తూ అతన్నే చూస్తుండేది... అతనికీ ఆమె అంటే ఇష్టమే..
ఒకరోజు ఆ అమ్మాయి అతనికి ఐలవ్ యూ అని చెప్పి.. తన లవ్ ని ప్రపోస్ చేసింది..
అందుకు అతను నన్ను చూడకుండా, తలచుకోకుండా ఒక్కరోజు అంతా ఉండగలవా ? అప్పుడు నీ ప్రేమను అంగీకరిస్తాను అని చెప్పాడు..
ఆమె సరేనని ఒకరోజంతా అతని గురించి అలోచించకుండా భారంగా గడిపేసింది...
మరుసటి రోజు ఉదయాన్నే ఆమె అతని ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్కడ అంతా ఏడుపులు, జనాలు.. లోపలికి వెళ్ళి చూస్తే జీవం లేకుండా ఉన్న అతని శరీరం కనపడింది..
అతనికి తెలుసు తన జీవితం ఇక మిగిలింది ఆ ఒక్కరోజే అని అందుకనే అలా చెప్పాడు.... చివరగా ఆమెకు ఒక ఉత్తరం కూడా రాసాడు..అందులో ఏం రాసుంది అంటే....
" ప్రియ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. కానీ నా జీవితం ఇక ఎంతో కాలం లేదు అని నాకు తెలుసు అందుకనే అలా చెప్పాను... నన్ను చూడకుండా,తలచుకోకుండా ఒక రోజంతా ఉండగలిగావు కదా.. అలానే నీ జీవితం అంతా సుఖంగా గడిపేయ్... నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి.....నీ సంతోషమే నేను కోరుకొనేది......" అని

