మనుష్యులు, దేవతలు, రాక్షసులు అందరూ ప్రజాపతి యెక్క బిడ్డలు. ఒకసారి ఆయన వద్దకు దేవతలు వెళ్ళి నాన్నగారు మాకు ఏదైనా బోధ చెయ్యండి మా జీవితాలు బాగుపడడానికి అని అడిగారు. అప్పుడు ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు.. అప్పుడు దేవతలు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
తరువాత ఆయన వద్దకు మనుష్యులు వచ్చి నాన్న గారు మాకు ఏదైనా బోధ చెయ్యండి అని అడిగారు. అప్పుడు మరలా ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు.. అప్పుడు మనుష్యులు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
తరువాత అక్కడికి రాక్షసులు వచ్చారు. నాన్న గారు మాకూ ఏదైనా బోధ చెయ్యండి అని అడిగారు. అప్పుడు మరలా ప్రజాపతి “ద” అని చెప్పి అర్దమయ్యిందా నేనేం చెప్పానో అని అడిగారు.. అప్పుడు రాక్షసులు “అర్దం అయ్యింది నాన్నగారు మేం అలానే పాఠిస్తాము” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ముగ్గురకు చెప్పింది “ద” అనే కానీ ఆ మూడు “ద” లకు ఎంతో తేడా ఉంది.......
దేవతలకు “ద” అని చెప్పడంలో అర్దం: మీరు దేవతలనే శరీరాలతో సమస్తమైన భోగములు అనుభవిస్తుంటారు(భోగ లాలసతో) . కాబట్టి మీకు ఉండవలసింది “దమము”. (దమము అంటే ఇంద్రియ నిగ్రహం). మీరు ఇలా దమము లేకుండా భోగములను అనుభవిస్తుంటే ఒకనాటికి మీ పుణ్యం అయిపోయి క్రిందపడిపోతారు. అందుకని మీరు దమమును కలిగియుండాలి.
మనుష్యులకు “ద” చెప్పడంలో అర్దం: మనుష్యునిగా పుట్టినవారికి ఏ బోధ చెయ్యకుండా వచ్చేది లోభం. కాబట్టి ఈ లోభానికి విరుగుడు “దానం”. కాబట్టి నిన్ను నువ్వు ఉర్దరించుకోవడానికి దానం చెయ్యడం నేర్చుకో.....ఆ దానం నిన్ను ఉర్దరిస్తుంది. ఉత్తర జన్మలు దానిపై ఆధారపడి ఉంటాయి.
అసురులకు “ద” అని చెప్పడంలో అర్దం: మీకు ఎప్పుడూ కోపం. ఎవరో ఒకరిని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు “దయతో” ఉండడం నేర్చుకోండి....
ప్రస్తుత కలియుగంలో పై చెప్పిన మూడు రకాల వాళ్ళు భూమి మీదే ఉన్నారు కామ, క్రోధ, లోభములు అనే మూడు రకాల గుణములు కలిగిన వ్యక్తులు ఉన్నారన్నమాట... కాబట్టి మన జీవితాలను ఉర్దరించుకోవడానికి…..
కోపం వస్తే ---నాలో ఆసురీ ప్రవృర్తి పెరుగుతుంది కనుకు నేను దయ కలిగి యుండాలి అని దాన్ని జయించండి
మీకు భోగలాలస ఏర్పడితే – నేను దమాన్ని కలిగియుండాలి అని జ్ఞాపకం ఉంచుకొని గెలవండి.
ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి అని అనిపిస్తే – ఈ విషయం జ్ఞాపకం తెచ్చుకొని దానం చేసి గెలవండి....
మీలో ఉన్న కామ, క్రోధ, లోభములను పై మూడు “ద” కారాములతో జయిస్తే మీ జన్మసార్ధకమైనట్లే.....
దమము అంటే ఇంద్రియ నిగ్రహంతో పంటి బిగువున అన్నింటినీ అణచిపెట్టుకొని ఉండగలగడం అన్నమాట....
ReplyDeleteWell said :)
ReplyDelete