December 9, 2011

YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి


   
       మామూలుగా మనం YouTube వంటి సైట్స్ లో  వీడియోలను చూస్తుంటాం. వాటిలో నచ్చినవాటిని Download చెయ్యడానికి Download managers వంటి software’s లేదా కొన్ని రకాల సైట్స్ ను వాడుతుంటాం. కానీ ఇలా చెయ్యడం వల్ల మనకు Bandwidth &  Time వేస్ట్ అవుతుంది. మీరు చూసిన  వీడియో already మీ కంప్యూటర్ లో లోడ్ అయ్యే వుంటుంది కదా ?  దాన్ని మరలా download చెయ్యడం ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?
 ఆ లోడ్ అయిన ఫైల్ ను వెదికి సేవ్ చేసుకుంటే సరిపోతుంది కదా?   
 Limited connections ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం.



 కంప్యూటర్ లో లోడ్ అయిన ఆ ఫైల్ ను నేరుగా కాపీ చెయ్యలేము కాబట్టి  Unlocker (782KB)  అనే Tool ని Install చేసుకోండి.  

     మెదట మీరు మీకు కావలసిన వీడియోని పూర్తిగా లోడ్ అవ్వనియ్యండి.  విండో Close చెయ్యద్దు...
    తర్వాత ఆ వీడియో కోసం ఈ path  కు వెళ్ళండి...
Windows XP:     C:/Documents and Settings /USERNAME / Local Settings / Temp /
Windows Vista / Windows 7:     C:/Users / USERNAME / AppData / Local / Temp/
[ USERNAME  అంటే మీ కంప్యూటర్ పేరు ]


   ఆ ఫోల్డర్ ఓపెన్ చేసాక  అక్కడ fla (ఒక నెంబరు) .tmp    అనే పేరుతో ఒక ఫైల్ ఉంటుంది. దానిపై రైట్ క్లిక్ చేసి Unlocker అని క్లిక్ చెయ్యండి. 
Fig-1

    అప్పుడు వచ్చిన screen లో కింద కాపీ అని ఎంచుకోవాలి (see  fig 2.)
ఇక ఆ పైల్ ను మీకు నచ్చిన చోట  ఒక పేరుతో  సేవ్ చేసుకోవచ్చు... అయితే చివర .flv అని extension ఇవ్వడం మరచిపోకండి.. 
Fig -2

అదే మీరు చూసిన వీడియో...హ్యాపీగా సేవ్ అయిపోయింది కదా ?

Note: ఈ ప్రాసస్ చేస్తున్నప్పుడు ఆ వీడియో ఉన్న page ను refresh గానీ reload గానీ చెయ్యద్దు.

5 comments:

  1. ఇక్కడ Application data అనే ఫోల్డర్ హిడెన్ ఫైల్ అది గమనించగలరు...

    ReplyDelete
  2. Very Useful....Thank u sai for sharing this....

    ReplyDelete
  3. ధ్యాంక్యూ వర్మ గారు.

    ReplyDelete
  4. మీరు చెప్పినది బాగానే వున్నది. కానీ, Temp ఫైలు ఒపెన్ చెయ్యటంలో తేడా వస్తే కొన్ని ఇబ్బందులున్నాయి. దీని కోసం "FREE CORDER" అనే FREE SOFTWARE ఉన్నది. దీనిని వేస్తే మనం నెట్లో PLAY చెసిన ప్రతీ విడియో దీనిలోనికి వస్తుంది. దీనిలో మనకు కావాల్సిన వాటిని విడియోలుగానూ, MP3లు గానూ మార్చుకోవచ్చును. ఆ SOFTWARE లింకు ఇదిగో:

    http://freecorder.com/

    ReplyDelete
  5. హహ...రాధాకృష్ణ గారు మీరు చెప్పింది నిజం... గత కొన్ని నెలలుగా నేనూ అదే వాడుతున్నాను...
    ఇలాంటి ధర్డ్ పార్టీ software's లేకుండానే సేవ్ చేయడం అనేది నా ఉద్దేశ్యం... Unlocker అనేది ఎంతో మంది ఇప్పటికే వాడుతుండే టూల్. (Pendrive వైరస్ ల నుంచి సేఫ్ రిమూవ్ చెయ్యడానికి)
    ధ్యాంక్యూ వెరీమచ్.....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...