మొబైల్స్ నుండి రేడియేషన్ వస్తుంది.. మనం వాటిని వాడేటప్పుడు మన బ్రెయిన్ కు దగ్గరగా ఉండడం వల్ల చాలా ప్రమాదం అని అందరికీ తెలుసు....కానీ మెబైల్ బయటకి వెళ్ళినపుడు వాడక తప్పదు. ఇంట్లో మాత్రమే వాడుకొనేందుకు ల్యాండ్ లైన్ ఎంతో బెటర్.... కానీ కొందరు ల్యాండ్ లైన్ బిల్లు కట్టలేక కావచ్చు... బాడుగ ఇల్లు మారేటప్పుడు కష్టం కావచ్చు..ఇంకా కొన్ని రకాల కారణాల వల్ల ఇంట్లో కూడా మెబైల్ నే వాడుతూ ఉంటారు.
ఇలా చెయ్యడం వల్ల ఇంతకాలం ల్యాండ్ వాడడం అలవాటుగా ఉన్న పెద్దవారు (ముసలివారు), లేదా సరిగా చదువుకోని వారు ఆ మెబైల్ వాడడం చేతకాక ఇబ్బంది పడుతుంటారు..
ఈ ఫోటోలో ఉన్న ఫోన్ చూడడండి.. ఇది మెబైల్ ఫోనే... దీనిలోనూ SIM card వేసే వాడుతారు. దీన్ని GSM Fixed Wireless Phone అని అంటారు. దీన్ని BSNL మనకు వెయ్యి రూపాయలకు అందిస్తుంది. దీనిలో మామూలు మెబైలో ఉండే అన్ని ఫీచర్స్ ఉన్నాయి (మెమరీ కార్డు, కెమెరా తప్ప). దీనిని మామూలు ల్యాండ్ వాడినట్టే వాడుకోవచ్చు. అంటే రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేస్తే చాలు.... దీని వల్ల మనకు రేడియేషన్ ప్రభావం ఉండదు. అదెలా అంటారా... రేడియేషన్ ఎలాగో ఉంటుంది, కానీ రిసీవర్ ఉండడం వల్ల మన మనకు దూరంగా Instrument ఉంటుంది, కాబట్టి మనపై ప్రబావం ఉండదు.
దీనిలో ఉన్నవి:
1. ఈ ఫోన్ నుండి USB పోర్టుద్వారా కంప్యూటర్ కు మెడెమ్ లాగా కూడా వాడుకొని నెట్ బ్రౌజ్ చెయ్యవచ్చు.
2. Contacts,Messages, Alarm, Calculator వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి..
దీనిలో మామూలు పెన్ టార్చిలో వాడే రీచార్జబుల్ బ్యాటరీలు (AA size) వాడడం వల్ల ఎప్పుడైనా చార్జి చేసుకోవడానికి కరెంటు లేని ప్రదేశంలో ఉంటే అలాంటి AA size బ్యాటరీలు కొని అందులో వేసి వాడుకోవచ్చు...
వెయ్యిరూపాయలు పెట్టి కొనడం వేస్టు కదా అని అనుకుంటున్నారా? అదేం కాదు.. దానితో వారిచ్చే సిమ్ లో మనకు ప్రతి నెలా 120 కాల్స్ చొప్పున 10 నెలలు వస్తాయి.. సో..మనం పెట్టిన దానికన్నా ఎక్కువ లాభం వచ్చినట్టే కదా ?
పెద్దలకు అనుకూలంగా ఉండే ఇలాంటి ఫోన్ గురించి కొంచెం ఆలోచించండి...
మీరు చాలా మంచి సమాచారం ఇస్తున్నారు చాలా థాంక్స్
ReplyDeleteఇట్లు
వేణు
www.swarajyam.blogspot.com
www.surajyam.org