నాకు నచ్చిన కొన్ని కొటేషన్లు:
"మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే.... మనల్ని అందరూ ఇష్టపడతారు.”
“అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది—భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది”
శ్రమ సంతోషాన్ని కలిగించినపుడు జీవితం ఆనందమౌతుంది. శ్రమ విధి నిర్వహణ మాత్రమే అయినపుడు జీవితం బానిసత్వం అవుతుంది....
అశాంతి కలిగినప్పుడు మౌనం వహిస్తే కొంత ఆవేశం చల్లారుతుంది....
చల్లారిన ఆవేశం వెంట ఆలోచన పెరుగుతుంది...
పరుగెత్తే ఆలోచనలలో ఆత్మావలోకనం చోటుచేసుకుంటుంది....
అందులో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.......
మనం ఎలా ఉండాలో ఏకాంతం చెబుతుంది.
మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది ?
ఒక చెడ్డ వ్యక్తి తారసిల్లినపుడు నీ హృదయాన్ని పరిరక్షించుకో.........
ఒక మంచి వ్యక్తి ఎదురైనప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకో...
జీవితం ఒక ఆట వంటిది. మనం ఆడుతూ ఇతరులను గెలిచే నేర్పును సంతరించుకోవాలి, ఇదే లోకం తీరు.....
కొటేషన్లు అన్నీ చాలా బావున్నాయి. అర్ధవంతంగా అందరికీ వర్తించేవి గానూ, ఆలోచింపచేసేవి గానూ, మరి కొన్ని పరివర్తన వైపుకు మళ్ళించగలిగేవి గానూ కూడా ఉన్నాయి. మరిన్ని సేకరించి అందరికీ పంచండి. ధన్యవాదాలు.
ReplyDeleteరాజా. gksraja.blogspot.com
ధ్యాంక్యూ రాజా గారు...
ReplyDeletenice quatations....
ReplyDelete