ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే||
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి వెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన తగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయి వెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండ పెట్టె వాని తలకెత్తరే ||

ఇక్కడ వినండి:
No comments:
Post a Comment