December 29, 2011

Google--Two-step verification వాడే వారికి సలహాలు....


  

    మీరు మీ Google అకౌంట్ కు Two-step verification వాడుతున్నట్లైతే.... కంప్యూటర్ నుండి  ఓపెన్ చేస్తున్నప్పడు ఎటువంటి  బాధ ఉండదు...మెసేజ్ రాగానే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది...


1.  అలా మెసేజ్ రావడం లేటు అయినట్లు అయితే  Call your phone అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వెంటనే మెబైల్ కు కాల్ వచ్చేస్తుంది...చక్కగా ఎంటర్ చేసుకోవచ్చు...


2.  Gtalk, Gmail mobile లాంటి అప్లికేషన్స్ నుండీ  ఓపెన్ చెయ్యడానికి   Application specific passwords లు క్రియేట్ చేసుకోవాలి.....మీ అకౌంట్ సెట్టింగుల పేజీ లోని Authorizing applications& sites   అనే ఆప్షన్ ద్వారా ఒక కొత్త Password క్రియేట్ చెయ్యాలి. మరింత సమాచారం కోసం

3.  ఇక మనకు సమస్య వచ్చేదల్లా మీరు మీరు మెబైల్ లోని Opera 6.0 వంటి బ్రౌజర్స్ నుండి మెయిల్ access చేస్తున్నప్పుడు.. అది ఏంటంటే... అదే మెబైల్ కు వచ్చిన  SMS ను బ్రౌజర్ close చెయ్యకుండా  ఎలా ఓపెన్ చెయ్యగలం... మామూలు GPRS మెబైల్స్ లో అప్లికేషన్ మినిమైజ్ చెయ్యడానికి అవకాశం ఉండదు కదా ?  Application specific password ని అది ఒప్పుకోదు....   కాబట్టి అప్పుడు Call your phone అనే option నే ఎంచుకోండి...అప్పుడు అది చెప్పిన కోడ్ రాసుకోని కాల్ ఆగాక ఎంటర్ చేసి... Remember this computer for 30days అని క్లిక్ చేసి verify చెయ్యండి. ఇక ఒక నెల రోజులు  బాధ ఉండదు....
దీనినే Recovery కోడ్ ద్వారా కూడా చెయ్యచ్చు.. కానీ కోడ్స్ అయిపోతున్నప్పుడు మరలా Generate చేసుకోవడం మరిచిపోకూడదు...

గూగుల్ Two-step verification కొన్ని సార్లు కష్టంగా అనిపించినా అకౌంట్ భద్రత కోసం తప్పకుండా వాడండి....

2 comments:

  1. ఇన్నాళ్ళు నేను Mobile నుండి చెయ్యలేక Two setp verification తీసేశాను. మంచి టిప్ చెప్పినందుకు Thanks

    ReplyDelete
  2. ధ్యాంక్యూ వెరీమచ్... క్రాంతి గారు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...