మతం కులం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి అని నా ఉద్దేశ్యం. అన్ని మతాలు బోధించేది ఒక్కటే “ పవిత్రంగా ఉండడం, ఇతరులకు సేవచెయ్యడం ” అన్ని మతాలు శాంతినే కోరుకుంటాయి. ఇదంతా వదిలేస్తే, మనం జన్మతహా ఒక మతంలో జన్మించాం. కనుక మనం అదే ఆచరిస్తుంటాం. ప్రక్క మతం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు.
అసలు నా దృష్టిలో మతం అంటే..... “ మనం మనకంటూ కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు పెట్టుకొని ఆవిధంగానే జీవిస్తుంటే అదే మతం.” అంటే మీరు కొన్ని కొత్త విధానలతో జీవిస్తుంటే మీరు ఒక ప్రత్యేకమైన మతంలో ఉన్నట్టు అర్దం.
మీ మతంలో లేనిదీ, ప్రక్క మతంలో ఉన్నది అంటూ ఏమీ ఉండదు. అన్ని మతాలలోనూ అన్ని ధర్మాలు ఉంటాయి. అయితే వాటిని చెప్పిన విధానం వేరుగా ఉండచ్చు అంతే... ఇక్కడ మీ మతం అంటే మీరు నమ్మిన మతం అని అర్దం.
నేను చెప్పేది ఒక్కటే మీరు నమ్మిన మతాన్ని ఆచరిస్తూ అందులోని మంచిని గ్రహించండి అంతేకానీ వేరొక దానిలో ఇలా ఉంది.... ఇది తప్పు, అది తప్పు, ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యాలి అంటూ ప్రక్క వారిని విమర్శిస్తూ మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు?.... మీకు ఇది నచ్చింది మీరు ఇదే ఆచరించండి.. వారికి అది నచ్చింది వారు అదే ఆచరిస్తారు....అసలు ఇక్కడ విమర్శ అనేది అవసరం అంటారా ?
ఈ మధ్య కొన్ని ఛానల్స్ చిన్న విషయాలను పెద్దవి చేసి చూపిస్తూ.. అర్ధం పర్ధం లేని చర్చలతో మనకు రాని అనుమానలను సైతం రేకెత్తిస్తున్నాయి. మీడియా అనేది ప్రజలకు నిజాలను చేరవెయ్యాలే తప్పా ఇలాంటి భావాలు పెంపొందించడానికి ప్రయత్నించకూడదు...
ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. అంతకు మించి వేరొక దైవం లేదు. జీవారాధకుడే నిజమైన దైవారాధకుడు. కాబట్టి మీకు నచ్చిన ధర్మం మీరు ఆచరిస్తూ జీవించండి. విమర్శించడంలో మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోవడం దండుగ అని నా అభిప్రాయం.....కాదంటారా?
Note: ఈ పోస్టు ఎవ్వరిని ప్రభావితం చెయ్యాలని రాయలేదు...ఈ మధ్య ఒక చానల్ లో చూసిన చర్చవల్ల ఇలా రాయాలని అనిపించింది. ఈ చిన్న జీవితంలో మనిషికి మనిషి దగ్గరకావడానికి ప్రయత్నించాలి కానీ, ఇలాంటి వాటితో మన మధ్య దూరాలు పెంచుకోకూడదు అని నా అభిమతం ..చదివిన కొందరైనా తమ మనస్తత్వాలను మార్చుకుంటారని అంతే.... ఎవరికైనా అభ్యతరంగా ఉంటే చెప్పండి, నిరభ్యంతరంగా పోస్టును తీసివేస్తాను.....
మీ ఈ టపా నిజంగా మీ అన్ని టపాలలో రాజసం .....నిజమే నేను ఎప్పుడు కోరుకునేది అదే అందరితో గొడవపడేది దీనిగురించే....ఉండే నాలుగు రోజులు హాయిగా ప్రశాంతంగా ఉందాం...ఏది నీది నాడు అంటూ లేదు అంటా మనది మనందరిది...ఎవరిదీ వారికి గొప్ప, అది ఏదైనా కానివ్వండి, అంతే కదా... నా చెప్పులైనా నాకు గొప్పే .......మానవత్వం, మంచితనం, అందరితో కలిసి ప్రసాంతంగా ఈ జీవితం గడిచిపోవాలి.....నా మనసులో ఉన్న భావాలకు ఒక అక్షర రూపం ఇచినందుకు, చాలా చాలా థాంక్స్ అండి....
ReplyDeleteకొసమెరుపు బాగుంది.
ReplyDeleteబాగా చెప్పారు...
ReplyDeleteఅందరూ మతాన్ని గురించి రోజూ ఎవరూ ఆలోచించారు. ఇంకొక్క మతం వాళ్ళు వచ్చి మీ మతం సరి అయినది కాదు మా మతంలో చేరండి అంటే ఏమి చెయ్యాలి ?.
ReplyDeleteఫణీంద్రగారు,మౌనముగా మనసుపాడినా గారు ఇద్దరికీ ధన్యవాదాలు...
ReplyDeleteRAAFSUN గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు...నిజానికి చెప్పాలంటే నా టపా కన్నా మీ కామెంటే బాగుంది.....
రావు గారు...అలాంటి వాళ్ళను మనమేం చెయ్యగలం చెప్పండి.. వాళ్ళ అమాయకత్వం చూసి నవ్వుకోవడం తప్పా.... ఏది ఎమైనా మనం నమ్మిన దానిపై మనం స్ధిరంగా ఉండగలిగితే చాలు....
ReplyDeleterodduna poye okadu mee pocket lonchi 100 rs adigite em chestaru, ivvanantaru, balavantam cheste chempa chellu manipistaru. mee daggaraku matam marchukomani vache vallato kooda ilage cheyyandi. simple.
ReplyDeleteబాగా చెప్పారు... శ్రీ గారు.....
ReplyDelete