January 24, 2016

Bitdefender antivirus ఉచితంగా మీకోసం  ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యడం ద్వారా మీరు ఈ ఆఫర్ ని పొందగలరు.  

http://gvsai.blogspot.in/2016/01/bitdefender-internet-security-giveaway.html

June 15, 2012

అది నాకు సాధ్యమేనా ?


గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను  ఇవ్వాలని ఉంది


తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను  కుమ్మరించాలని ఉంది.


స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా  తుడిచేయ్యాలని ఉంది.


సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో  నిండిన మౌనాన్ని   దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.


అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది


మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే  సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.

ఇవ్వన్నీ సాధ్యమేనా ?


మీకు తెలుసా ?  ఇది నా 200 పోస్టు... 100 కంప్యూటర్ టిప్స్ కూడా ఈ రోజుతో పూర్తి  అయ్యాయి..
మీ అమూల్యమైన కామెంట్ తెలుపగలరు..

FaceBook ఫ్రెండ్స్ ని ఇలా ఆటపట్టించండి..Face Book లో నేను రాసిన Status ను 5200 మంది like చేసారు..


నిజానికి నాకున్న  ఫ్రెండ్స్  120 మందే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ?

మీరూ  http://www.fakebookstatus.com/  అనే సైట్ కి వెళ్లి ఎన్ని లైక్ లు. కామెంట్లు కావాలో రాసుకొని  మీ ఫ్రెండ్స్ మోసం చెయ్యండి...


PDF files బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే..


Chrome Browser లో Built-in  పీడీఫ్   viewer ఉండడం వల్ల  బ్రౌజర్ లోనే PDF  ఫైల్స్  ఓపెన్ అవుతాయి... పెద్దపెద్ద  ఫైల్స్  ఉన్నప్పుడు అది ఇబ్బంది కరంగా ఉంటుంది కదా.... 

June 12, 2012

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండికంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....
పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen  చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం... 

అలా కాకుండా మనం ఉంటున్న  ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..

అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ  సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.

ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.  Click Here

Install చేసుకున్నాక సెట్టింగులలో మీరుంటున్న  లొకేషన్ సెట్ చేసుకోండి.. 

Thanks to hu Blog... 
Related Posts Plugin for WordPress, Blogger...