June 15, 2012

అది నాకు సాధ్యమేనా ?


గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను  ఇవ్వాలని ఉంది


తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను  కుమ్మరించాలని ఉంది.


స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా  తుడిచేయ్యాలని ఉంది.


సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో  నిండిన మౌనాన్ని   దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.


అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది


మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే  సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.

ఇవ్వన్నీ సాధ్యమేనా ?


మీకు తెలుసా ?  ఇది నా 200 పోస్టు... 100 కంప్యూటర్ టిప్స్ కూడా ఈ రోజుతో పూర్తి  అయ్యాయి..
మీ అమూల్యమైన కామెంట్ తెలుపగలరు..

33 comments:

  1. chaala bhgha raasaarndi, sai garu.
    keep writing;

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారు ధ్యాంక్యూ అండీ..

      Delete
  2. సాయి గారూ. మీ కవితలో ఎన్ని ఆశలో, ఎన్ని ఆశయాలో, అంత అందమైన మాటలను అలవోకగా చెప్పేశారు. పెద్ద, పెద్ద ఉపమానాలు వాడకుండా వెన్నెల దారి ఇలా ఉంటుంది అని చూపెట్టారు. ఇంకా ఎంతో చెప్పాలని ఉంది, మీరన్నట్లు సాద్యమైతే సంతోషమే.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు కవిత మెత్తాన్ని ఒక్క మాటలో చెప్పేసారు కదా అండీ....
      ధ్యాంక్యూ అండీ.. అదంతా సాధ్యమవ్వాలనే అనుకుంటున్నాను.. లేకుంటే ఒక కవితలానైనా మిగిలిపోతుంది...

      Delete
  3. computer tips లో century
    total double century
    అయిపోయాయన్నమాట.
    సెంచరీలు మీద సెంచరీలు కొట్టాలని
    కోరుకొంటున్నాను...
    :-)
    అభినందనలు సాయీ!

    అన్నట్లు కవిత గురించి చెప్పనే లేదు...
    సరళమైన పదాలతో అల్లిన హారంలా ఉంది...
    నీ ఆశయాలు నెరవేరాలని ఆశిస్తూ...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు.... ప్రత్యేకంగా ధన్యవాదాలు అండీ.... సెంచరీలు మీద పెద్దగా ఆశలేదు.. కానీ ప్రయత్నిస్తాను..
      కవిత గురించి మీ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  4. అయ్యో.. మీ అభిమానంలో సాధ్యమేనా అనే పదాన్ని సాధమేనా అని రాసినా పట్టించుకోలేదేంటండీ....

    ReplyDelete
  5. సాయి గారూ , మీకు అభినందనలు.
    మీరు మరెన్నో చక్కటి పోస్ట్స్ అందించాలని కోరుకుంటున్నాను.
    కవిత చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ప్రయత్నిస్తాను అండీ.. ధ్యాంక్యూ...

      Delete
  6. అది నాకు సాధ్యమేనా
    మదిలో సందేహమేల మంచిని కోరే
    హృదయము గలిగిన సాయీ
    పదపడి మీ కోర్కె దీరు భాగ్యము గలుగున్ .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. రాజారావు గారు నా బ్లాగుకి స్వాగతం.. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  7. మీకు అసాధ్యం అయ్యేది ఏముంది సాయి గారు......సూపర్ గా ఉంది మీ కవిత.
    అభినందనలు 200 పోస్ట్ లు పూర్తీ చేసినందుకు...మీరు ఇంకా మంచి మంచి టిప్స్ ,ఇలా
    ఆలోచింపచేసేవేన్నో రాయాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.....
    --మీ సీత ...

    ReplyDelete
    Replies
    1. సీతగారు ధన్యవాదాలు అండీ.... కానీ ఇక ఏమో చెప్పలేను.... సారీ...

      Delete
  8. సాధ్యాసాధ్యాలు మన చేతుల్లో లేనివి కాని, ఆశయం మాత్రం గొప్పగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయిగారు.. ధ్యాంక్యూ వెరీమచ్ అండీ....

      నిజమే సాధ్యా సాధ్యాలు దేవుడికి ఎరుక.... ప్రయత్నించడమే మన పని.....మంచి మాట చెప్పారండీ...

      Delete
  9. సాయి గారూ , సాదమేనా అన్న "అప్పుతచ్చు " మీరు సరిచేసుకుంటారు అనే వదిలేసాము,లేకుంటే టీచర్ ని దాటిపోతుందా చెప్పండీ. ఇంపోజిషన్ రాయించమా..

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్ వద్దు అండీ ఇంపోజిషన్ రాసే ఓపిక లేదు.. ప్లీజ్ మేడం నా వల్లకాదు... ఇంకెప్పుడూ చెయ్యను......

      Delete
    2. ok, maa nellore abbayyavu kadaa vadilesanu

      Delete
    3. ఫాతిమా గారు మాది నెల్లూరు అని మీతో ఎప్పుడైనా చెప్పానా ?

      Delete
    4. అదే ఎలా తెలుసు అండీ.. ప్లీజ్ చెప్పండి.. ఫాతిమా గారు...

      Delete
    5. avunaa kaadaa cheppandi. elaa theluso cheptaanu, saaayi garoo.

      Delete
    6. ఫాతిమా గారు నిజమే.. ఇప్పుడైనా చెప్పండి ఎలా తెలుసో.. ప్లీజ్..
      (గాలిలోకి బాణం కానీ వెయ్యలేదు కదా)

      Delete
    7. gaaliloki bhaanam veste nellore maatrame taguluthundaa, mee face chusi cheppanu,

      Delete
    8. ఫాతిమా గారు.. ఈ tension నేను తట్టుకోలేను.. ప్లీజ్ ఎలా తెలుసో చెప్పేయండి.. నా ఫేస్ మీరెక్కడ చూసారు ?

      Delete
    9. endukanta tension inthakee aa uooraa kaadaa cheppandi. sorry uoohinchaananthe.

      Delete
  10. where there is a will there is a way....సాధ్యమే:)

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు అనికేత్ గారు.. ధ్యాంక్యూ వెరీమచ్ అండీ...

      Delete
  11. చాలా బాగా వ్రాశారు.
    ఆశ్లేషములను అని చాలా బాగా చెప్పారు.
    ఆశ్లేషము అంటే కౌగిలి అని కదా అర్ధం .

    ReplyDelete
    Replies
    1. వనజమాలి గారు... చాలా సంతోషం అండీ నా బ్లాగులో కామెంటినందుకు....

      అవును అండీ ఆశ్లేషము అంటే కౌగిలి అనే అండీ....

      చిన్న డౌట్ అండీ.. మీరు కామెంట్ రాసినట్టు మెయిల్ రాలేదు... అది ఎలా సాధ్యం.. చెప్పగలరా ?

      Delete
  12. ఎందుకు సాధ్యం కాదు .మన మనసులో అలాంటి భావాలుంటే ప్రకృతి కూడా మనకు తోడ్పడుతుంది.
    మీ డబుల్ సెంచరికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ రవిశేఖర్ గారు.... మంచి మాట చెప్పారు...

      Delete
  13. Your post is so amazing and informative. You are always write your in the meaningful and explaining way.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...