June 11, 2012

అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే ఇప్పపూలు కప్పలాయెరా





అప్పడుండే కొండలోన ఇప్పపూలు ఏరబోతే ఇప్పపూలు కప్పలాయెరా 
ఓ వేంకటేశ ఇప్పపూలు కప్పలాయెరా
అప్పలుగల వాని వలనే ఓ వేంకటేశ 

ఆకాశాన పొయ్యేకాకి మూకజూచి కేకవేశే మూక మూడు విధము లాయరా 
ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా

అహోబిలయ్య గుంటలోన వొల్వలు ఉదుక పోతే వొల్వలెల్ల మల్లెలాయెరా
ఓ వేంకటేశా దీనిభావము నీకే తెలుసురా 

అహోబిలాన చెట్టు బుట్టే భూమి యెల్ల తీగపారే కంచిలోన కాయ కాచేరా 
ఓ వేంకటేశా శ్రీరంగాన పండు పండేరా 

పుట్టామీద చెట్టు బుట్టే భూమియెల్ల తీగపారే పర్వతాన పండు పండేరా
ఓ వేంకటేశా అందవచ్చు కోయరాదురా   

చేయిలేనివాడుకోశే నెత్తిలేని వాడుమేశే కాళ్ళులేని వాడు నడచే
 ఓ వేంకటేశా పెదవిలేనివాడు చిలుక తినేరా 

గుంట యెండి పండు పండే పండుకోసి కుప్పవేశే కుప్పకాలి యప్పు తీరేరా 
ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా

సందెకాడ తలవ్రాలు సంధిదీర వేంకటరాయా  తెల్లవారనాయనీడరా
ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా

ముత్యాల పందిటిలోన ముగ్గురు వేంచేసి రాగ ముక్కంటి దేవుని జూచేరా 
ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా

ఏటిలోన వలవేసే తాటిమాను నీడలాయె దూరపోతే చోటులేదురా 
ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా

ముందు కూతు రాలు ఆమె ముందు ఆలు కూతురాయె పొందుగా పెండ్లాము తానాయె
ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా

ఆకులేని అడవిలోన మూడుతోకల పెద్దపులిని మేక యొకటి యెత్తి మింగేరా 
ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా 

పున్నమ వెన్నెలలోన వన్నెలాడితోను గూడి కిన్నెర మీటుచు పొయ్యేవు 
ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా

అర్థరాత్రివేళలోని రుద్రవీణ నెత్తుకొని నిద్రించిన నిన్ను పొగడగ
ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా  ||


 

ఈ కీర్తన  అలమేలుమంగ పదసన్నిది అనే TTD cd లో ఉంది. కానీ నాకు వాల్యూమ్స్ లో ఎక్కడా కన్పించలేదు.. కానీ  వికీ సోర్స్ లో అన్నమాచార్యసంకీర్తనలో ఉంది..మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరు... 
తెలియకపోతే సింపుల్ గా  ఒకసారి వినేయండి....

4 comments:

  1. paata baagundi saayigaaru. chaala saarlu vinnanu.

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ ఫాతిమా గారు...

      Delete
  2. పాట చాలా బాగుందండి .

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ మాలా కుమార్ గారు...

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...