Showing posts with label ఆధ్యాత్మిక కీర్తనలు. Show all posts
Showing posts with label ఆధ్యాత్మిక కీర్తనలు. Show all posts

May 6, 2012

మఱ్రిమాని మెదలులో కుర్రవాడు వీడు - Lord Siva songs By Balakrishna prasad




మఱ్రిమాని మెదలులో కుర్రవాడు వీడు
బుర్రలు పండిన వారికి బోధకుడైనాడు  ||

మాటను మనసును దాటిన తేటతెలివి ఏదో
వాటముగా మౌనముతో వ్యాఖ్యచేసినాడు 
జాటజూట ధారి లేత జాబిలి తాలుపు వాడు
కూటస్ధుడు నాకిదివో గురియై గురువైనాడు  || మఱ్రి ||


వేలికొనల లీలగ నా వెన్నువీణ సవరించి 
లాలనతో నాద రహస్యాల గరపువాడు
హేలగ నా మేధగ నన్నేలిన షణ్ముఖనుతుడు
వీలుగ కరముద్రతో విద్య తెలుపువాడు    || మఱ్రి ||

నమశ్శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే




నమ:శ్శివాయ నటేశ్వరాయ 
ఉమావరాయ నమో నమస్తే ||

హృదయ పఠికా మధ్యగతాయ 

సదమలవాజ్ఞయ సంపత్కరాయ
నదీధరాయ నగవాసాయ 
విధుకిరీటాయ వేదమయాయ    ||నమ:||

పశుపతయే శ్రీపతి వినుతాయ
హసిత సిత శుభాంగాయ భవాయ
ప్రశాంతిదాయ పరాత్పరాయ 
నమో నిశితధీద్రిశానిష్టిదాయతే   ||నమ:||

Listen Here:


April 29, 2012

జయ జయ శ్రీ సుదర్శన -- శ్రీ సుదర్శన రగడ



శ్రీ పెద్దతిరుమలాచార్యల వారు రచించిన శ్రీ సుదర్శన రగడ


జయ జయ శ్రీ సుదర్శన జయజయ జయ శ్రీ సుదర్శన ||
ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము
హరవిరించి దివిజాశ్రయ చక్రము
గురుగతి రెండవకోణపుఁ జక్రము
స్రావనిశాచరసంఘము చక్రము
కోవిద తృతీయకోణపుఁ జక్రము ||


February 5, 2012

త్యాగరాజ పంచరత్న కృతులు -- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

నాకు బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలంటే ఎంతో ఇష్టం... ఇంట్లో ఉండే పాత క్యాసెట్స్ వెదుకుతూ ఉంటే ఆయన పాడిన త్యాగరాజ పంచరత్నకృతులు దొరికాయి.. అందుకనే వాటిని ఇలా రికార్డ్ చేసి అప్‍లోడ్ చేసాను..లిరిక్స్ కావాలంటే Click here అన్నదానిపై క్లిక్ చెయ్యగలరు..

January 3, 2012

Photos తో నేను తయారు చేసిన సాయిబాబా వీడియో....



    నాకు బాబా అంటే చాలా ఇష్టం..అందుకే, బాబా రక్షాకవచం అనే ఈ పాటని కొన్ని ఫోటోలతో కలిపి Slide show  వీడియోగా తయారుచేసాను..... చూసి ఎలా ఉందో చెప్పండి...

Related Posts Plugin for WordPress, Blogger...