April 29, 2012

జయ జయ శ్రీ సుదర్శన -- శ్రీ సుదర్శన రగడ



శ్రీ పెద్దతిరుమలాచార్యల వారు రచించిన శ్రీ సుదర్శన రగడ


జయ జయ శ్రీ సుదర్శన జయజయ జయ శ్రీ సుదర్శన ||
ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము
హరవిరించి దివిజాశ్రయ చక్రము
గురుగతి రెండవకోణపుఁ జక్రము
స్రావనిశాచరసంఘము చక్రము
కోవిద తృతీయకోణపుఁ జక్రము ||


రణభయంకరవిరాజిత చక్రము
గుణయుతచతుర్థకోణపుఁ జక్రము
హుంకారరవమహోగ్రపుఁ జక్రము
కొంకని పంచమ కోణపుఁ జక్రము
ఫట్కారపరబ్రహ్మము చక్రము
షట్కోణాంతవిశాలపుఁ జక్రము
బహళపటహరవభైరవ చక్రము
మిహిరతుహినకరమిళితము చక్రము  ||  జయ ||

కఠినపవి నికరకల్పిత చక్రము
శఠమతఖండనచతురము చక్రము
దంభోళినఖరదారుణ చక్రము
గంభీరసమరకలితము చక్రము
చండమారుతవిసారిత చక్రము
కుండలీశముఖఘోషిత చక్రము
కాలదండశతకాండము చక్రము
జ్వాలానలముఖశౌర్యము చక్రము  ||  జయ ||

విస్ఫులింగచయవిభ్రమ చక్రము
సాస్ఫాలితభుజహారము చక్రము
విద్యుత్కొటినివేశము చక్రము
ప్రద్యోతనమణిబంధము చక్రము
సంభ్రమసంభృతిసహజము చక్రము
బంభ్రమితవిదిక్పటలము చక్రము
భద్రగజప్రభుపాలన చక్రము 
రుద్రైకాదశరూపము చక్రము  ||  జయ ||

రక్షోగణగళరక్తము చక్రము
భక్షితదుష్టప్రాణము చక్రము
కంఠనాదఘనగర్జిత చక్రము
లుంఠితతిమిరవిలోకన చక్రము
రోదసినిబిడసురోచి శ్చక్రము
వేదరాశిగణవేల్లిత చక్రము
ప్రళయకాలయమభావము చక్రము
దళితపాతకవితానము చక్రము ||  జయ ||


వజ్రాయుధబహువర్షుక చక్రము
వజ్రమౌక్తికసువర్ణపుఁ జక్రము
బ్రహ్మది దివిజపాలన చక్రము
జిహ్మగభూషణజీవిత చక్రము
షొడశభుజసంశోభిత చక్రము
బాడబసహశ్రబంధుర చక్రము
ప్రేంఖత్పరశువిభీషణ చక్రము
శంఖచక్రశరచాపము చక్రము  ||  జయ ||


అసిగదాత్రిశూలాంకుశ చక్రము
ముసలపాశహలమోహన చక్రము
అగ్నిఖేటవజ్రాయుధ చక్రము
లగ్నకుంతశుభలక్షణ చక్రము
నేత్రత్రయవర్ణితగురు చక్రము
రాత్రించరవిద్రావణ చక్రము
జ్వాలాకేశవిశాలపుఁ జక్రము
కాలకూటనిభకాంతుల చక్రము  ||  జయ ||

ఘూర్ణమానమదగుంభిత చక్రము
పూర్ణభక్తజనపోషక చక్రము
నిఘ్నబాణకరనికరము చక్రము
విఘ్నాపహరణవిభవము చక్రము
విహ్వలితనరకవీరము చక్రము
సైంహికేయగళసమ్హర చక్రము
ముష్కరపౌండ్రనిమూలన చక్రము
దుష్కరకర్మవిధూనన చక్రము  ||  జయ ||


నక్రకంఠదళనక్రమ చక్రము
ధిక్కృతదనుజాతిక్రమ చక్రము
దుర్వాసస్సంస్తుత్యము చక్రము
శర్వరీశశతసంచయ చక్రము
త్రిపురవిజయకరతీవ్రము చక్రము
విపులనవరసనవీనము చక్రము
మంత్రాధిరాజమానిత చక్రము
యంత్రపీఠమధ్యాసిత చక్రము  ||  జయ ||

కుంజరపాలనగుణయుత చక్రము
రంజితపుష్పపరాగము చక్రము
సంధ్యారుణపటసంవృత చక్రము
వంధ్యేతరగర్వస్ఫుట చక్రము
మిథ్యావాదతిమిరహర చక్రము
తథ్యామృతసంతర్పిత చక్రము
కల్హారమాలికాధర చక్రము
సిల్హధూపసంశ్లిష్టము చక్రము  ||  జయ ||

అర్కానలదీపాంచిత చక్రము
మార్కండేయనమస్కృత చక్రము
హవ్యకవ్యవివిధాశన చక్రము
దివ్యమునివరధ్యేయము చక్రము
వలయముమీదఁటవలగొను చక్రము
బలవదష్టదళపద్మపుఁ జక్రము
ఎడలఁగేసరము లెనసిన చక్రము
వడినందుమీఁదివలయపుఁ జక్రము  ||  జయ ||

షొడశదళములసొంపగు చక్రము
వీడనికీసరవితతుల చక్రము
మొగిమూఁడువలయములుగల చక్రము
తగుభూగోళముఁదనరిన చక్రము
అంగమంత్రములనధికపుఁ జక్రము
జంగిలిపదాఱుస్వరముల చక్రము
అనఘచక్రగాయత్రిక చక్రము
తననిజమంత్రముదగిలిన చక్రము  ||  జయ ||

నరసింహమంత్రనామపుఁ జక్రము
ధరనక్షరములదామెన చక్రము
మహాసుదర్శనమంత్రము చక్రము
విహారితవజ్రవిధముల చక్రము
అంబరనరసింహాక్షర చక్రము
సాంబుజాక్షపాశాంకుశ చక్రము
మానితదిక్పతిమంత్రము చక్రము
నానావిధహరినామపుఁ జక్రము  ||  జయ ||

వేయువిధంబులవెలసిన చక్రము
వేయంచులుగలవిశ్వపుఁ జక్రము
భావించుసుజనపాలన చక్రము
శ్రీవేంకటపతిచేతిది చక్రము  ||  జయ ||

2 comments:

  1. చాలా బాగుంది సాయి గారు.....మీరు చాలా బాగా కలెక్ట్ చెస్తారు ....చాలా చాలా చాలా బాగుంది....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...