May 9, 2012

ఇందులోన గల సుఖము ఇంతే చాలు -- అన్నమాచార్య సంకీర్తనలు



Download (G Balakrishna Prasad)

ఇందులోన గల సుఖము ఇంతే చాలు మాకు
ఇందు వెలియైన సిరులేమియూ నొల్లము ||


ఆది దేవునచ్యుతు సర్వాంతరాత్ముకుని
వేదవేద్యు కమలాక్షు విశ్వపూర్ణుని |
శ్రీదేవు హరిని ఆశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటిమి అన్యము మేమొల్లము ||


పరమాత్ము పరిపూర్ణు భవ రోగవైద్యుని
మురహరు గోవిందుని ముకుందుని  |
హరి పుండరీకాక్షు అనంతుని అభవుని
పరగ నుతించితిమి పరులనేమొల్లము  ||



అనుపమ గుణ దేహుని అణురేణు పరిపూర్ణు
ఘనుని చిరంతనుని కలిభంజనుని |
దనుజాంతకుని సర్వ ధరు శ్రీవేంకటపతిని
కని కొలిచితిమి యేగతులు నేమొల్లము ||


2 comments:

  1. మంచి సహిత్యం తో కూడుకున్న పాట...చాలా బాగుంది.

    ReplyDelete
  2. ధ్యాంక్యూ సీతగారు.....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...