Download (G. BalaKrishna Prasad)
చదివి బతుకరో సర్వజనులు మీరు
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||
కదిసి నారాయణాష్టాక్షర మిదియే ||
సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు
వేదవ్యాసులు చదివిన చదువు |
వేదవ్యాసులు చదివిన చదువు |
ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు
గాదిలి నారాయణాష్టాక్షర మిదియే ||
సతతము మునులెల్ల చదివినట్టిచదువు
వెత దీర బ్రహ్మ చదివిన చదువు |
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు
గతిగా నారాయణాష్టాక్షర మిదియే ||
చలపట్టి దేవతులు చదివినట్టిచదువు
వెలయా విప్రు లు చదివేటి చదువు |
పలుమారు శ్రీ వేంకటపతి నామమై
భువి కలుగు నారాయణాష్టాక్షర మిదియే ||
No comments:
Post a Comment