May 6, 2012

మఱ్రిమాని మెదలులో కుర్రవాడు వీడు - Lord Siva songs By Balakrishna prasad




మఱ్రిమాని మెదలులో కుర్రవాడు వీడు
బుర్రలు పండిన వారికి బోధకుడైనాడు  ||

మాటను మనసును దాటిన తేటతెలివి ఏదో
వాటముగా మౌనముతో వ్యాఖ్యచేసినాడు 
జాటజూట ధారి లేత జాబిలి తాలుపు వాడు
కూటస్ధుడు నాకిదివో గురియై గురువైనాడు  || మఱ్రి ||


వేలికొనల లీలగ నా వెన్నువీణ సవరించి 
లాలనతో నాద రహస్యాల గరపువాడు
హేలగ నా మేధగ నన్నేలిన షణ్ముఖనుతుడు
వీలుగ కరముద్రతో విద్య తెలుపువాడు    || మఱ్రి ||


ఈ పాటను ఇక్కడ వినండి...

Download  (G Balakrishna Prasad garu)


ఇలాంటివే మరికొన్ని పాటలు:


1. నమశ్శివాయ నటేశ్వరాయ 



2. ఒకడే రుద్రుడు సకలంబితడే ఇక రెండవవారెవరూ లేరు 



౩.  హరుడు మృత్యుంజయిడు.



5. ఐదుమోములతోడ అన్ని చూచెడివాడు



6.  ప్రళయకర డమరుకర పరమేశ్వరా.... 



7. అతిపురాతన వటము ఆది శివవటము

1 comment:

  1. చాలా మంచి కీర్తనలు చూపించారు. పంచుకొన్నందుకు నెనర్లు.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...