మనిషిగ పుట్టెను ఒక మట్టి
తన మనసును పెంచినదే మట్టి
మానై పుట్టెను ఒక మట్టి
తన పూవై పూసినదే మట్టి
ఆయువు పోసెను ఒక గాలి
జీవాత్మల నూదిన దే గాలి
వేణువులూదెను ఒక గాలి
పరమాత్ముని కూపిరి ఏ గాలి
ఆకలి పెంచిన దొక నిప్పు
తన అంగము పెంచినదే నిప్పు
కన్నుగ వెలిగెను ఒక నిప్పు
తన వెన్నుని గాంచిన దేనిప్పు
దాహము తీర్చెను ఒక నీరు
తన దేహపు టొరవడి ఏ నీరు
కడలై పొంగిన దొక నీరు
తన కన్నుల పొంగినదే నీరు
అటనట నిలిచెను ఒక గగనం
తన ఘటమున నిండిన దేగగనం
ఘటనాఘటనల నదుమ నటనలో
మెరుపులు మెరిసినదే గగనం
పంచభూతముల పంజరశుఖమై
అలమట జెందిన నేనెవరో
ఏడు కొండలా ఎత్తున నిలిచి
బదులే పలుకని నీవెవరో ఇంతకు నాకు నీవెవరో
ఇంతకు నాకు నీవెవరో......
thanks for sharing such a nice song.
ReplyDeletekani , idi annamacharya kirtana laga ledandi ?
can you please confirm ?
-sravan
నిజమే శ్రావణ్ గారు.. నేనూ అన్ని వాల్యూమ్స్ చూసాను.. ఎక్కడా కనపడలేదు... కానీ సాట బాగుందని పోస్టు చేసాను.. అయితే తప్పు ఏంటీ అంటే ఆధ్యాత్మికం అని లేబుల్ నొక్కబోయి. అన్నమాచార్య సంకీర్తనలు అని చేసాను... ఈ సంకీర్తన గురించి నాకూ అంతగా ఏమీ తెలీదండీ.. సారీ....
ReplyDelete