Showing posts with label సాంకేతికాలు. Show all posts
Showing posts with label సాంకేతికాలు. Show all posts

October 16, 2020

YouTube లో Shorts తయారు చేయడం ఎలా ?

 

హలో అండీ, అందరూ ఎలా ఉన్నారు ? 

ఈ రోజు ఈ పోస్టులో YouTube కొత్తగా ఇండియాలో రిలీజ్ చేసిన Shorts ,  చిన్న వీడియోలు ఎలా చెయ్యలో చెప్పబోతున్నాను. 

ఇలా టిక్ టాక్ లాంటి చిన్న వీడియోలను చెయ్యడం వలన మీ లోని టాలెంట్ ప్రపంచానికి తెలియడమే కాకుండా, మీకు Subscribers కూడా పెరుగుతారు. 

ఈ క్రింద ఉన్న వీడియోలో మీకు అన్ని వివరాలు చెప్పాను.  వినగలరు. 




మీరు చేసే వీడియోలు సందేశాత్మకంగాను, ఉపయోగకరంగాను ఉంటాయని ఆశిస్తున్నాను. 

మీకోసం ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాల్ను రాయలని అనుకుంటున్నాను. మీరేమంటారు ? 

January 24, 2016

Bitdefender antivirus ఉచితంగా మీకోసం



  ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యడం ద్వారా మీరు ఈ ఆఫర్ ని పొందగలరు.  

http://gvsai.blogspot.in/2016/01/bitdefender-internet-security-giveaway.html

June 15, 2012

FaceBook ఫ్రెండ్స్ ని ఇలా ఆటపట్టించండి..



Face Book లో నేను రాసిన Status ను 5200 మంది like చేసారు..


నిజానికి నాకున్న  ఫ్రెండ్స్  120 మందే ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ?

మీరూ  http://www.fakebookstatus.com/  అనే సైట్ కి వెళ్లి ఎన్ని లైక్ లు. కామెంట్లు కావాలో రాసుకొని  మీ ఫ్రెండ్స్ మోసం చెయ్యండి...


PDF files బ్రౌజర్ లో ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే..


Chrome Browser లో Built-in  పీడీఫ్   viewer ఉండడం వల్ల  బ్రౌజర్ లోనే PDF  ఫైల్స్  ఓపెన్ అవుతాయి... పెద్దపెద్ద  ఫైల్స్  ఉన్నప్పుడు అది ఇబ్బంది కరంగా ఉంటుంది కదా.... 

June 12, 2012

కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా... కళ్లను ఇలా రక్షించుకోండి



కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటాం....
పగలు చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ రాత్రి సమాయాలలో Screen  చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది.అలాంటప్పుడు brightness తగ్గించుకొని చూస్తుంటాం... 

అలా కాకుండా మనం ఉంటున్న  ప్రదేశం ను బట్టి, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ Brightness, colors మార్చిపెట్టే software ఉంటే బాగుంటుంది కదా..

అలాంటిదే ఈ Flux అనేది. ఇది సూర్యాస్తమయ  సమయాన్ని, ఉష్ణోగ్రతను బట్టి కంప్యూటర్ రంగులు, వెలుగు మార్చి మన కళ్లను రక్షిస్తుంది. కేవలం 546KB మాత్రమే ఉన్న ఈ టూల్ చాలా బాగుంది.

ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.  Click Here

Install చేసుకున్నాక సెట్టింగులలో మీరుంటున్న  లొకేషన్ సెట్ చేసుకోండి.. 









Thanks to hu Blog... 

June 11, 2012

FaceBook లో messages అన్నీ ఒకేసారి డిలీట్ చేసుకోవాలంటే..



FaceBook లో మనం చేసిన చాటింగ్స్ , మెసేజ్ లు అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి.. వాటిని ఒక్కొక్కటి డిలీట్ చెయ్యాలి అంటే కష్టం గా ఉంటుంది కదా.. ఈ chrome extension వేసుకుంటే మెసేజస్ పక్కన  రెడ్ కలర్ x మార్కు వస్తుంది.. దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యక్తికి చేసిన మెసేజ్ లన్నీ ఒకేసారి డిలీట్ అవుతాయి..

June 7, 2012

FaceBook లో File sharing చేసుకోవచ్చు ఇలా..

.
ఈ మధ్య FaceBook గ్రూప్స్ లో ఫైల్ షేరింగ్ option కూడా ప్రవేశపెట్టారు.... 
Status రాసే దగ్గర ఇలా upload file అనే ఆప్షన్ కన్పిస్తుంది..


దీనిద్వారా 25MB వరకూ ఉన్న ఫైల్స్ group తో పంచుకోవచ్చు...


గ్రూప్ లో ఎవరైన దానిలో మార్పులు కూడా చెయ్యచ్చు....


నేను ఒక సింపులు RAR ఫైల్ upload చేసాను చూడండి..

June 6, 2012

Email ID హ్యాక్ అయితే నాకేం అనుకుంటున్నారా?


Email హ్యాక్ అయితే ఏమవుతుందో నాకు అంతగా  తెలీదు.. కానీ తెలిసిన రెండు ముక్కలు రాస్తా...    

నా ఫ్రెండ్స్ కొందర్ని అడినప్పుడు ఇలా అన్నారు.... " నా మెయిల్ లో ఏముంటాయి ? తొక్కలో మెయిల్స్ అంతే కదా  హ్యాక్ చేస్తే వాడికే టైం వేస్టు....  అది పోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటాను... "

వినడానికి బాగానే ఉంది... కానీ అసలు హ్యాక్ చేసినవాడు ఏం చెయ్యచ్చు.....?

మీరు అనుకుంటారు.. పోతే మెయిల్ ఐడీ యే కదా అని.... అదే కాదు మీకు సంబంధించిన అన్నీ అకౌంట్లు మీరు కోల్పోయినట్టే... ఎలా అంటారా ?   పూర్తిగా చదివితే అర్దం అవుతుంది..
 గూగుల్ అకౌంట్ తీసుకుంటే మెయిల్ తో పాటు దానికి సంబంధించిన Youtube, Orkut, Google+ , Blogger, Picasa లో ఉన్న మీ ఫోటోలు.. ఇంకా అన్ని గూగుల్ ప్రోడస్ట్స్ వాడికి ఇచ్చేసినట్టే.....   ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏదైనా చెత్త కంటెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ మీరు కాదు అలా చేసింది అంటే నమ్ముతారా ?   నమ్మరు.. నానా అవస్ధలు పడాలు ఒప్పించడానికి....  కష్టపడి రాసుకున్న బ్లాగులు పోతాయి.. ఎలా ఉంటుంది అసలు..

మీరు మెయిల్స్ లో చాలా చోట్ల అడ్రస్ ఇచ్చి ఉండచ్చు.. పోన్ నెంబర్లు ఉండచ్చు... వాటి సంగతి ఏంటి ?   
ఆ హ్యాకర్ మీ ఐడీ నుండీ ఏదైనా సంఘవిద్రోహ శక్తులకు మెయిల్స్ చేస్తే  ప్రభుత్వం నుండి ముప్పు వచ్చేది ఎవరికి ? మీకు కాదా ?  నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది అంటారా ?   గూగుల్ password recovery కి మెబైల్ నెంబరు ఇచ్చి ఉంటారు..ఇంకెక్కడైనా ఇచ్చే ఉంటారు.... దాని ద్వారా మిమ్మల్ని పోలీసులు పట్టుకోవచ్చు...  మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్టుద్వారా నైనా(వాళ్ళు ఇచ్చుకోని ఉండచ్చు) , logging locations బట్టి  మిమ్మల్ని పట్టుకోవడం పెద్దపనేం కాదు.....  

ఇదంతా వదిలేయండి... మెయిల్ కు సంబంధించినవే కాదు .. మిగతా అన్నీ అకౌంట్లు ఫోయినట్టే... అది ఎలా అంటే......

మీకు చాలా సైట్లలో అకౌంట్లు ఉంటాయి... దానిలోకి వెళ్ళి Forgot password అని నొక్కాడు అనుకోండి... reset link మీ email కు వస్తుంది కదా.. సో.... మెయిలే కాదు ఆ సైట్ కూడా హ్యాక్ చేసినట్టేగా ... FaceBook, Twitter,  రైల్వే అకౌంట్లు, paypal, DropBox , recharge sites,Bank sites  ఒక్కటేంటి ఇంక అన్నీ ఫోయినట్టే..... వాటి ద్వారా ఇంకేమైనా చెయ్యచ్చు..  లేని సైట్లలో రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా చెయ్యచ్చు....

మీరు కాకుండా ఎవరో మీలాగే ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుంది మీకు ?    చెప్పండి..... నిద్ర అయినా పడుతుందా ?

కాబట్టి  బలమైనా passwords వాడండి.ఎక్కువ special characters వాడండి (@ % ^ & * ! ~ ఇలాంటివి)......   వీలైతే తప్పకుండా two step verification వాడండి.. recovery settings లో మెయిల్ ఐడీ, answers కరెక్టుగా ఇవ్వండి... పోన్ నెంబర్లు అస్సలు వాడద్దు password గా..... 
ఇలా చేసుకొని హ్యాపీగా ఉండండి.....   కొల్ఫోయ్యాక బాధపడడం కంటే జాగ్రత్త పడడం మేలు...
ఒక మెయిల్ పోతే ఇంకోటి అనే భ్రమలో ఉంటే వెంటనే మారండి... కాదంటారా ?

June 3, 2012

Google Drive లోని పైల్స్ Gmail నుండే వెదకాలంటే....


Google Drive లో మనం Save చేసుకున్న  ఫైల్స్ ను Gmail నుండే వెదకాలంటే ఇలా చెయ్యండి.

MP3 పాటలను Upload చెయ్యకుండానే cut చెయ్యాలంటే....



        ఒక పాటలోని కొంత భాగం మాత్రమే మనకు కావాలి అంటే MP3 cutter అనే software వాడాలి అని అందరికీ తెలుసు... ఆన్ లైన్ లో కట్ చేసుకొనే సదుపాయాలు  చాలా  సైట్లలో ఉంది. కానీ వాటిలోకి పైల్ upload చెయ్యాలి. ఒక్కోసారి ఫైల్ సైజు  పెద్దదిగా ఉన్నప్పుడు టైమ్, బ్యాండ్ విడ్త్ వేస్టు అవుతుంది. 

May 27, 2012

Google + మరియూ Gmail చాటింగ్ emotions మీకు తెలుసా ? (Hidden G+ and Gmail Chating Emotions)

Google + లోనూ... G Talk లోనూ చాటింగ్ చేసేటప్పుడు  మనకు తెలియని కొన్ని Hidden Emotions ఉంటాయి.. వాటిని వాడుకోవాలంటే .. ఇదిగోండి. ఇవి వాడండి... చాటింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇవి వాడారు అనుకోండి.. మీ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు కదా.. కొత్తరకం smileys చూసి..

May 26, 2012

సముద్రం లోపల వెదకండి.. గూగుల్ తో



   గూగుల్  చైనా వారికోసం ఇలా  సముద్రంలో కదులుతూ  ఉన్నట్లు ఎఫెక్టుతో ఇమేజెస్ వెదికే సదుపాయం కల్పించింది.. మీకూ కావాలంటే ట్రై చెయ్యండి..  

May 19, 2012

ఏదైనా సైట్ లో Mobile Number ఇవ్వడం ఇష్టం లేదా? ఇలా తప్పించుకోండి (Bypass All SMS Verifications)




    ఈ మధ్య చాలా సైట్లలో రిజిష్టర్ చేసుకొనేటప్పుడు మన మెబైల్ నెంబరు అడగడం.. ఆ నెంబరుకు  మెసేజ్ పంపి అందులో ఉన్న నెంబరును verify చెయ్యమని అడుగుతున్నాయి....  మామూలుగా మనం  మన అవసరం కొద్దీ వాడుకొనే G mail, YouTube, Facebook వంటి సైట్లలో మన నెంబరు ఇస్తే ఉపయోగం ఉంది . (ఈ ట్రిక్ వాటికైనా వాడుకోవచ్చు అనుకోండి).. కానీ వాటిలో ఇలా తప్పుగా  చేస్తే మనకే కొంత నష్టం.

   అలా కాకుండా  ఒక చిన్న గేమ్ ఆడుకోవడానికి, లేదా ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికో కుడా  సై ట్ లో రిజిష్టర్ అవ్వాలనుకోండి. దానికి కూడా మెబైల్ నెంబరు ఇవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది.. మీరే చెప్పండి..ఇక అప్పటి  పిచ్చి పిచ్చి మెసేజ్ లు, DND లో Registration ఇవన్నీ అవసరమా ?.  అలా ఎక్కడైనా మెబైల్ నెంబరు ఇవ్వడం ఇష్టం లేకపోతే  ఇలా చెయ్యండి.

May 18, 2012

MS Word లో Drop Cap ఆప్షన్ ఎలా వాడాలో తెలుసా ?



Drop Cap అంటే  మన మ్యాటర్ లో  మెదటి అక్షరం పెద్దగా ఉంటుంది కదా అది....

May 17, 2012

FaceBook లో అనామకుల నుండి Messages వచ్చి ఇబ్బందిగా ఉందా ?



Face Book  లో తెలియని వారైనా మనకు మెసేజ్ చెయ్యడానికి అవకాశం ఉంది.. కానీ తెలియని అనామకులు అందరూ మనకు మెసేజ్ చేస్తూ విసిగిస్తూ ఉంటే ఇలా చెయ్యండి.

May 15, 2012

మీకు ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసా ?



మనం పంపిన ఈ మెయిల్ ఎలా వెళ్తుందో తెలుసుకోవాలని ఉంటే ఈ లింకు చూడండి

అక్కడ ఉన్న start the history అనే బటన్ ను నొక్కండి....
--

April 28, 2012

Google Easter egg నుండి ఒక చిన్న తమాషా


హాయ్  గూగుల్  Easter egg నుండి ఒక చిన్న తమాషా 

ఈ  కింద లింకు మీద క్లిక్ చెయ్యండి.....  

                 Click Here


లేదా zerg rush అని గూగుల్ లో సెర్చ్ చెయ్యండి...

April 4, 2012

Youtube Videos ను ఇలా Save చేసుకోండి.


ఇంతకు మునుపు పోస్టులలో Youtube Videos ను ఎలా సేవ్ చేసుకోవచ్చో చెప్పాను.. కదా.. 

YouTube వీడియోలను Download కాదు ఇలా Save చేసుకోండి (Click to see)


ఈ మధ్య  Chrome లోని వీడియో సేవ్ చేసే ఏ extensions కనపడం లేదు.. సో ఈ పద్దతిని ఫాలో అయిపోండి... సింపుల్ ...

ముందు వీడియో అంతా చూసేయ్యండి... 
తర్వాత మీ కంప్యూటర్ లోని ఈ లోకేషన్ కు వెళ్ళండి... 

Windows 7:
C:\Users\Administrator\AppData\Local\Google\Chrome\User Data\Default\Cache

Windows XP:
C:\Documents and Settings\Administrator\Local Settings\Application Data\Google\Chrome\User Data\Default\Cache

Administrator బదులు మీ యూజర్ అకౌంట్  పేరు అనమాట

అక్కడ  రైట్ క్లిక్ చేసి Group By Size అనే ఆప్షన్ ఎంచుకోండి.. (easy way to find file) Image లో చూపించిన విధంగా వస్తుంది.. 

ఆ ఫైల్స్ లో F అనే లెటర్ తో స్టార్ట్ అవుతున్న  ఫైల్స్ ను VLC Player లో ఓపెన్ చెయ్యండి...
 మీ వీడియో దొరుకుతుంది.. సో ఆ  ఫైల్ కాపీ చేసి కావలసిన  చోట paste చేసుకొని దాని పేరు మార్చండి.. 




చివరలో .flv అని కూడా చేర్చండి.. సరిపోతుంది..   (ఉదా: sai.flv)
ఇలా ఎంతో సింపుల్ గా సేవ్ చేసుకోవచ్చు  వీడియోలను......


Note:  Application data అనే కొన్ని ఫోల్డర్లు Hidden లో ఉంటాయి.. సో ...  Floder సెట్టింగులలో  Show hidden files and Floders option టిక్ చేసుకుంటే అవి కనిపిస్తాయి

April 3, 2012

మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా తెలుసుకోండి..


భవిష్యత్తులో పంపవలసిన మెయిల్స్ ను ముందుగానే ఎలా సెట్ చేసుకోవచ్చో.. నా పాత పోస్టు Gmail లో Future Emails ఇలా పంపండి  లో చెప్పాను...

ఇప్పుడు దానిలోనే ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది.. మీరు పంపిన మెయిల్ చదవబడిందా లేదా అని ట్రాక్ చెయ్యవచ్చు..

అది ఎలాగో ఈ వీడియోలో చూడండి..


ఆడాన్ ను ఇక్కడ నుండి Install చేసుకోండి http://www.rightinbox.com/

ఇకపై మెయిల్ పంపేటప్పుడు Track అని క్లిక్ చేస్తే చాలు, ఎదుటి వాళ్ళు చదివి నపుడు మనకు మెయిల్ వస్తుంది..


March 24, 2012

ఇంటర్నెట్ కనెక్షన్ Slow గా ఉందా వీడియోలను ఇలా చూడండి


 

ఒకవేళ మీకు ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉంటే యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు అవి ఆగి ఆగి (Buffer) రావడం గమనించే ఉంటారు...
ఇలా రాకుండా ఉండేందుకు వీడియో క్వాలిటీ ని 240p లేదా 360p గా కానీ ఎంచుకుంటూ ఉంటాం..
ప్రతి సారీ ఇలా వీడియో క్వాలిటీని సెలెక్ట్ చెయ్యడం కష్టం గా ఉంటే ఈ Chrome extension ను install చేసుకోండి.. అదే ఇక ఉన్న క్వాలిటీలు అన్నింటిలో తక్కువది ఎంచుకొని మనకు వీడియోలు చూపిస్తుంది..

ఇక్కడ నుండి ఇస్‍స్టాల్ చేసుకోండి: Click To add Chrome extension


అదిసరే అలా తక్కువ క్వాలిటీలోనే Full screen మోడ్ లో వీడియో చూడాలి అంటే ఎలా...?

 ఏంలేదు ఈ extension వేసుకుంటే సరిపోతుంది.. Click here to add Chrome Extension 





Thanks.. Good bye.....

source:

https://chrome.google.com/webstore/detail/mnnigofcppdedajacenolhffbknmjpag/
https://chrome.google.com/webstore/detail/filcaigohbbmpjggnbfagfioljhpebdf 
 
Related Posts Plugin for WordPress, Blogger...