Showing posts with label నా కవితలు. Show all posts
Showing posts with label నా కవితలు. Show all posts

June 15, 2012

అది నాకు సాధ్యమేనా ?


గుప్పెడంత గుండెను,
దొసెడంత మనసును,
చెరగని చిరునవ్వులను,
వెచ్చని ఆశ్లేషములను  ఇవ్వాలని ఉంది


తరగని ప్రేమను,
అంతులేని ఆనందాలను,
మరపురాని మమతలను,
అపురూపమైన అనురాగాలను  కుమ్మరించాలని ఉంది.


స్వార్ధపు సామ్రాజ్యములను,
విషపు చూపుల శరాలను,
మాటలు చేసిన గాయాలను,
బాధలు చేసిన తీరువులను సమూలంగా  తుడిచేయ్యాలని ఉంది.


సంకుచిత భావనలను,
విషాదపు రోదనలను,
ఒంటరితనపు భావాలను,
మదిలో  నిండిన మౌనాన్ని   దూదిపింజల్లా ఎగరగొట్టాలని ఉంది.


అరమరికలు లేని నవ్వులకోసం.
బుల్లి బుల్లి సంతోషాల కోసం,
సరికొత్తకలలను మోసుకొచ్చే అలల కోసం,
వెలుగు చూడని పాషణ రాత్రులను పారద్రోలే కాంతి కిరణాల కోసం ఎదురుచూడాలని ఉంది


మతం అనే తుపాకీ చేసే మారణహోమాలు లేని,
కులం మత్తెక్కిన కీచకులుండని,
మోసపు మనుగడలు మచ్చుకైనా ఉండని,
విజ్ఞానపు వెలుగులు వెదజల్లే,
మానవత్వంతో మెసలే మనుషులు ఉండే  సరికొత్త సమాజం నిర్మించాలని ఉంది.

ఇవ్వన్నీ సాధ్యమేనా ?


మీకు తెలుసా ?  ఇది నా 200 పోస్టు... 100 కంప్యూటర్ టిప్స్ కూడా ఈ రోజుతో పూర్తి  అయ్యాయి..
మీ అమూల్యమైన కామెంట్ తెలుపగలరు..

June 9, 2012

ప్రకృతి నా నేస్తం

 
తెల్లవారుతుండగానే 
ఉదయభానుడు తన లేలేత కిరణాలతో  లేవగొట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు.

చిన్నగా  లేచి,  పిల్ల కాలువలో నిలబడితే
చల్లని నీరు  నా పాదాలు తాకుతూ జలజలా అంటూ లయబద్దంగా పలకించింది

పనికని పొలం దగ్గరికెళ్తే 
పిల్లగాలి, ఎలా ఉన్నావంటూ  నా మేను   నిమిరుతూ సాగిపోయింది...

నా అరి కాళ్లతో భూమిని పలకరించితే
గడ్డిపూలు కదుపుతూ భూమాత  హాయ్ అని చెప్పింది.


ఎండకి తాలలేక చెట్టుకిందకెళ్తే
చెట్టు తన కొమ్మలను వింధ్యామరలు చేసి  వీచింది
దానిపై పక్షులు కిలకిలా అంటూ నాతో మాటలు కలిపి అలసట తీర్చాయి..

సాయంత్రం  సముద్రతీరం చేరితే
అలలతో హొయలుపోతూ హౌ ఆర్ యూ అంది....

అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే.. 
భానుడిని  డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని  వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ)

కొలిమిలా కాలిన నేలను చల్లార్చడానికి 
వర్షపు చినుకులు చిటపడ రాలుతూ నాకు  చెక్కిలిగిలి పెట్టాయి...
 
చూసే మనసుండాలే కానీ ప్రకృతి లో ఎక్కడ చూసినా " స్నేహ భావమే" తొనికిసలాడుతుంది........... కాదంటారా ?


June 4, 2012

నా ఆశలకు రూపానివి నువ్వు


 చెలి.......
నా ఊహలకు ఊపిరి నువ్వు
నా ఊసులకు ఉనికివి నువ్వు
నా ఆశలకు రూపానివి నువ్వు
నా కనులకు వెలుగువు నువ్వు
నా కలలకు రంగువు  నువ్వు
నా చిరునవ్వుకు గమ్యం నువ్వు
నా మది పలికే రాగానివి నువ్వు
నా యదలో ఆశలు రేపే చిరుజల్లువు నువ్వు 
నా ఆలోచనలకు భావానివి నువ్వు
నా కడదాకా నడిచే బంధానివి నువ్వు
నిన్ను చూసిన క్షణం నా గుండె కాంతి వేగానికి సమానమైంది
నిన్ను తలచిన మరుక్షణం నా మనసు కేరింతలుకొట్టే పాపాయిలా మారింది
నా కనులు అనుక్షణం నిన్నే చూడాలని తపిస్తున్నాయి....
నే పీల్చే శ్వాస నిరంతరం నిన్నే గుర్తుచేస్తోంది.
ప్రతిక్షణం నా పాదాలు నీతోనే నడవాలనుకుంటున్నాయి
నీపై ఉన్న నా ప్రేమని ప్రకటిద్దామంటే గొంతు మూగబోయింది
ఆ ప్రేమ మదిలోనే ఆవిరిలా ఇంకిపోయింది
నిన్ను చూడనివేళ మనసు ఉప్పొంగిన సముద్రమైంది
నువ్వు దూరమైన వేళ నా హృదయం చలనం లేని రాయిగా మారింది....
నా చెలి నన్ను విడిచి వెళ్ళకు....
చెరగని  చిరునవ్వు గల  నీ పెదాలతో అడిగితే నా ప్రాణమైనా ఇవ్వడానికి నే సిద్దంగా ఉన్నాను....


May 17, 2012

నీ సుఖమే నే కోరుకున్నా.....

.
నా చెలి....
నీవు నాదానవనుకున్నా
నీతోనే నడవాలనుకున్నా
నీ నీడనై నిలవాలనుకున్న
నీవున్నదే నాలోకమనుకున్నా
నీవులేనిదే నేనెందుకనుకున్న
నీవుంటే చాలనుకున్నా
నీకోసమే నా జీవితమనుకున్నా
నీ ఊసులే నా ఊహలనుకున్నా
నీవులేనిదే బతకలేననుకున్నా
నీకడ వరకూ తోడుందాం అనుకున్నా
నీతోనే చావాలనుకున్నా
నీవు విడిచిపేట్టేస్తే నివ్వెరపొయ్యా
నీవెళ్ళిపోతుంటే నిచ్చేష్టుడనై చూసా
నీరాకకై నిరీక్షించా
నీవిక రావని నిరాస చెందా
నీ తలపుల తోనే బ్రతికేస్తున్నా....కానీ
నీ సుఖమే నే కోరుకున్నా...........


May 16, 2012

నా మెహం నేనెక్కడ ఖాళీగా ఉన్నాను...



స్కూల్లలో, కాలేజీలలో చదివి, చదివి నేర్చుకొని, చదువు పూర్తవ్వగానే 
కోచింగ్ సెంటర్లలో ఆడి, ఓడి మెంటల్ అబిలిటీలు, రీజనీంగులని బట్టీలు బట్టి

చిన్నపాటి ఉద్యోగం సంపాదించి చూసే సరికి వయసయిపోయి
మ్యారేజ్ బ్యూరోలలో బయోడేటాలు నమోదుచేసుకొని
నెట్ లో చూసిన అమ్మాయిని పబ్బులో కలసి ఓకేచేసి,
ఒకింటి వాళ్ళయి, ఓ చంటిబిడ్డ చేతికి రాగానే,
వీడ్ని నేను పెంచెలేను బాబోయ్, కేర్ సెంటర్లో చేర్పించరాదా
అంటూ ఉద్యోగం చేసి అలసివచ్చిన భార్య అరుపులకు తట్టుకోలేక
వాడినో కేర్ సెంటర్లో పడేసి, ఏమైపోతుందో ఈ బాల్యం అంటూ అలోచిస్తూ
బాధపడూతూ, నా బతుకిలా ఎందుకు తగలడిందా అని అనుకుంటూ...

నా మెహం నేనెక్కడ ఖాళీగా ఉన్నాను గాక........

May 12, 2012

ఇక నా ఉనికేది చెలి


నా చెలి......
నువు నిదురవైతే, నేను ఓ కల
నువ్వు సంగీతం అయితే నేను  రాగం
నువ్వు నిప్పు అయితే నేను సెగ
నువ్వు మెరుపు అయితే నేను ఉరుము
నువ్వు ఉష్ణం అయితే నేను ఆవిరి
నువ్వు జనని అయితే నేను శిశువును
నువ్వు వాన అయితే నేను చినుకును
నువ్వు పాటవైతే నేను పల్లవి
నువ్వు ఆయువు అయితే నేను ఊపిరి
నువ్వు వెలుగువు అయితే నేను నీడనై ఎల్లవేళలా నీ వెన్నంటే ఉంటా.....
అదే నువ్వే చీకటైతే..... ఇక నేనెక్కడ ?


May 9, 2012

నీ చిరునవ్వే నా గమ్యం నేస్తం


ఓ నేస్తం...

భారమైన నా హృదయానికి ఓదార్పు నీ స్నేహం
అశాంతితో నిండిన నా మనసుకు ఆదరింపు నీ స్నేహం
ఆవేదనతో రగులుతున్నప్పుడు ఓ చల్లని పలకరింత నీ స్నేహం
ప్రవాహంలా జాలువారే నా కన్నీటికి ఓ అడ్డుకట్ట నీ స్నేహం
అలసిన నా కన్నులలో కమ్మని కల నీ స్నేహం


అస్తమిస్తున్న నా జీవితానికి వెలుగునుచూపిన సూర్య కిరణం నీవు


అందుకే  ఓ నేస్తం నీ చిరునవ్వే నా గమ్యం

నా పెదవులపై ఈ దరహాసం విరిసిందీ నీ కోసమే..
కానీ నా నవ్వుకూ నీ నవ్వుకూ చిన్న తేడా ఉంది నేస్తం


నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతావు
నేను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాను


కమ్మని కలల్లా క్షణకాలమే మిగిలే ఈ జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక గుర్తువునీవు....
నన్ను మరు(విడు)వకు  నా నేస్తం ఎన్నటికీ....
మిగిలిపోతా నీ స్నేహం అనే సముద్రంలో ఒక బిందువులా..............


--సాయి



March 22, 2012

నా ఉగాది శుభాకాంక్షలు...





తెలుగు వారి తొలిపండుగ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఉగాది
కోయిల కుహూకుహూ రాగాలకు అంతరార్దం ఉగాది
కొమ్మల చిగురుల వన్నెలకు అర్దం ఉగాది
పాడిపంటల పచ్చదనాలకు, రైతన్నల ఆనందాలకు ఆలంబనం ఉగాది
ఆటపాటలకు, సప్తస్వర సమ్మేళనాలకు, పంచాంగ శ్రవణాలకు వేదిక ఉగాది
నూతన ఆశలను, కోట్లు కుమ్మరించినా కొనలేని ఆనందాలను అందించేను ఈ ఉగాది
అందుకే సాదరంగా సాగనంపండి ఆఖరను
ఉప్పొంగిన ఆనందంతో వెల్లివిరిసిన సంతోషంతో ఆహ్వానించండి ఈ నందనం ను మీ 
ఇంట  ఆనందం నింపాలని....
ఆ నందన వనంలో మనజీవనం నవనవ లాడాలని ఆశిస్తూ.....

--సాయి
Related Posts Plugin for WordPress, Blogger...