తెల్లవారుతుండగానే
ఉదయభానుడు తన లేలేత కిరణాలతో లేవగొట్టి గుడ్ మార్నింగ్ అన్నాడు.
చిన్నగా లేచి, పిల్ల కాలువలో నిలబడితే
చల్లని నీరు నా పాదాలు తాకుతూ జలజలా అంటూ లయబద్దంగా పలకించింది
పనికని పొలం దగ్గరికెళ్తే
పిల్లగాలి, ఎలా ఉన్నావంటూ నా మేను నిమిరుతూ సాగిపోయింది...
నా అరి కాళ్లతో భూమిని పలకరించితే
గడ్డిపూలు కదుపుతూ భూమాత హాయ్ అని చెప్పింది.
ఎండకి తాలలేక చెట్టుకిందకెళ్తే
చెట్టు తన కొమ్మలను వింధ్యామరలు చేసి వీచింది
దానిపై పక్షులు కిలకిలా అంటూ నాతో మాటలు కలిపి అలసట తీర్చాయి..
సాయంత్రం సముద్రతీరం చేరితే
అలలతో హొయలుపోతూ హౌ ఆర్ యూ అంది....
అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే..
భానుడిని డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ)
చూసే మనసుండాలే కానీ ప్రకృతి లో ఎక్కడ చూసినా " స్నేహ భావమే" తొనికిసలాడుతుంది........... కాదంటారా ?
సాయి గారూ.....
ReplyDeleteచక్క గా రాసారు...నిజమే స్నేహం అనేది ప్రక్రుతి లో నుండి ఆవిర్భవించిందే...
"అబ్బా... ఇక తాపం తట్టుకోలేను అనగానే..
భానుడిని డ్యూటీ దించి తను చార్చి తీసుకొని తెల్లని వెన్నెల కురింపించాడు మా మామ(చందమామ"
చక్కని ఆలోచన ......అంత కన్నా చక్కని కవిత..... !!
--సీత
సీత గారు ఏదో అనిపించింది రాసేసాను అండి.. ధ్యాంక్యూ వెరీమచ్...
Deleteమీరు ఆ లైన్ ఎందుకు పట్టుకున్నారో నాకు తెలుసులేండి.....
Mi Kavita Na manasuloki cherindi antha bagundi thank you
Deletebhagundandi mee kavitha
ReplyDeleteభాస్కర్ గారు ధన్యవాదాలు అండి...
Deleteసాయి గారూ, కవిత అంత అందంగా చెప్పి కాదనగలరా అంటే ఎలా అంత సాహసం చేయగలమా ? నిజమే ప్రకృతి మనకు నేస్తమే. చాలా బాగారాసారు
ReplyDeleteఫాతిమ గారు.......... మీరు మరీ నండి...
Deleteధ్యాంక్యూ వెరీమచ్....
ప్రకృతిని నేస్తంగా భావిస్తే మానవుడి కష్టాలు చాలా వరకు తీరతాయి.చక్కని కవిత్వం .
ReplyDeleteనిజమే రవిశేఖర్ గారు.... ప్రకృతిని నేస్తం గా భావించాలి...
Deleteధ్యాంక్యూ వెరీమచ్ అండి
మంచి పోలిక. చక్కగారాసారు!
ReplyDeleteప్రద్మార్పిత గారు.. ధ్యాంక్యూ సో మచ్.....
Deleteబాగుంది సాయిగారూ...చివరి ఆంగ్లపదాలు కూడా తెలుగీకరించితే ఇంకా హృద్యంగా వుండేది అని నా భావం..అబినందనలతో..
ReplyDeleteనిజమే వర్మగారు...... ఈ సారికి ఇలా వచ్చేసింది.. ఇకపై పూర్తిగా తెలుగులోనే రాసేలా ప్రయత్నిస్తాను
Deleteధ్యాంక్యూ వెరీమచ్...
prakruti andariki nestame....baavundi....:)
ReplyDeleteధన్యవాదాలు మంజు గారు........
Deletesai
ReplyDeleteweldone
durgeswara గారు ధ్యాంక్యూ అండి...
Deleteహరిసేవ బ్లాగులో మాకోసం మంచి మంచి విషయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు..
చాలా బాగుంది సాయి గారూ!
ReplyDeleteబాగా వ్రాసారు... :-
చాలా బాగుంది సాయి గారూ!
బాగా వ్రాసారు.. :-)
@శ్రీ
@శ్రీ
ధ్యాంక్యూ వెరీమచ్ శ్రీ గారు..
Deleteఎంత బాగా రాశారండి!బాగా నచ్చింది.
ReplyDeleteలక్షీదేవి గారు. అంతగా నచ్చినందుకు.. ధన్యవాదాలు అండి...
DeleteBAGA VUNDI
ReplyDeletenaaku prakruti gurinchi konni katalu kavali
ReplyDeleteచాలా బాగుంది అండి
ReplyDelete