Showing posts with label కాదంటారా ?. Show all posts
Showing posts with label కాదంటారా ?. Show all posts

June 6, 2012

Email ID హ్యాక్ అయితే నాకేం అనుకుంటున్నారా?


Email హ్యాక్ అయితే ఏమవుతుందో నాకు అంతగా  తెలీదు.. కానీ తెలిసిన రెండు ముక్కలు రాస్తా...    

నా ఫ్రెండ్స్ కొందర్ని అడినప్పుడు ఇలా అన్నారు.... " నా మెయిల్ లో ఏముంటాయి ? తొక్కలో మెయిల్స్ అంతే కదా  హ్యాక్ చేస్తే వాడికే టైం వేస్టు....  అది పోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటాను... "

వినడానికి బాగానే ఉంది... కానీ అసలు హ్యాక్ చేసినవాడు ఏం చెయ్యచ్చు.....?

మీరు అనుకుంటారు.. పోతే మెయిల్ ఐడీ యే కదా అని.... అదే కాదు మీకు సంబంధించిన అన్నీ అకౌంట్లు మీరు కోల్పోయినట్టే... ఎలా అంటారా ?   పూర్తిగా చదివితే అర్దం అవుతుంది..
 గూగుల్ అకౌంట్ తీసుకుంటే మెయిల్ తో పాటు దానికి సంబంధించిన Youtube, Orkut, Google+ , Blogger, Picasa లో ఉన్న మీ ఫోటోలు.. ఇంకా అన్ని గూగుల్ ప్రోడస్ట్స్ వాడికి ఇచ్చేసినట్టే.....   ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏదైనా చెత్త కంటెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ మీరు కాదు అలా చేసింది అంటే నమ్ముతారా ?   నమ్మరు.. నానా అవస్ధలు పడాలు ఒప్పించడానికి....  కష్టపడి రాసుకున్న బ్లాగులు పోతాయి.. ఎలా ఉంటుంది అసలు..

మీరు మెయిల్స్ లో చాలా చోట్ల అడ్రస్ ఇచ్చి ఉండచ్చు.. పోన్ నెంబర్లు ఉండచ్చు... వాటి సంగతి ఏంటి ?   
ఆ హ్యాకర్ మీ ఐడీ నుండీ ఏదైనా సంఘవిద్రోహ శక్తులకు మెయిల్స్ చేస్తే  ప్రభుత్వం నుండి ముప్పు వచ్చేది ఎవరికి ? మీకు కాదా ?  నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది అంటారా ?   గూగుల్ password recovery కి మెబైల్ నెంబరు ఇచ్చి ఉంటారు..ఇంకెక్కడైనా ఇచ్చే ఉంటారు.... దాని ద్వారా మిమ్మల్ని పోలీసులు పట్టుకోవచ్చు...  మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్టుద్వారా నైనా(వాళ్ళు ఇచ్చుకోని ఉండచ్చు) , logging locations బట్టి  మిమ్మల్ని పట్టుకోవడం పెద్దపనేం కాదు.....  

ఇదంతా వదిలేయండి... మెయిల్ కు సంబంధించినవే కాదు .. మిగతా అన్నీ అకౌంట్లు ఫోయినట్టే... అది ఎలా అంటే......

మీకు చాలా సైట్లలో అకౌంట్లు ఉంటాయి... దానిలోకి వెళ్ళి Forgot password అని నొక్కాడు అనుకోండి... reset link మీ email కు వస్తుంది కదా.. సో.... మెయిలే కాదు ఆ సైట్ కూడా హ్యాక్ చేసినట్టేగా ... FaceBook, Twitter,  రైల్వే అకౌంట్లు, paypal, DropBox , recharge sites,Bank sites  ఒక్కటేంటి ఇంక అన్నీ ఫోయినట్టే..... వాటి ద్వారా ఇంకేమైనా చెయ్యచ్చు..  లేని సైట్లలో రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా చెయ్యచ్చు....

మీరు కాకుండా ఎవరో మీలాగే ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుంది మీకు ?    చెప్పండి..... నిద్ర అయినా పడుతుందా ?

కాబట్టి  బలమైనా passwords వాడండి.ఎక్కువ special characters వాడండి (@ % ^ & * ! ~ ఇలాంటివి)......   వీలైతే తప్పకుండా two step verification వాడండి.. recovery settings లో మెయిల్ ఐడీ, answers కరెక్టుగా ఇవ్వండి... పోన్ నెంబర్లు అస్సలు వాడద్దు password గా..... 
ఇలా చేసుకొని హ్యాపీగా ఉండండి.....   కొల్ఫోయ్యాక బాధపడడం కంటే జాగ్రత్త పడడం మేలు...
ఒక మెయిల్ పోతే ఇంకోటి అనే భ్రమలో ఉంటే వెంటనే మారండి... కాదంటారా ?

March 6, 2012

అన్నింటికీ అబద్దమేనా ?


ఈ లోకంలో ఏ పని జరగాలన్నా, ఆఖరికి స్నేహం కావాలన్నా.. అబద్దమే శరణ్యమా ?....  అదే కరెక్ట్ అయితే అలాంటి స్నేహం నాకొద్దు....

స్నేహం పెరగాలన్నా అబద్దమే మార్గం అనుకుంటా... మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది మాత్రం నిజం... 
ఉదా: మీ స్నేహితుడు నేను ఎలా ఉన్నాను..బాగున్నానా ? అని అడిగితే, "చీ నువ్వేం బాగున్నావురా? ఏడ్చినట్టు ఉన్నావు  రా...." అని నిజం చెప్తే  దాదాపు ఎవ్వరూ స్నేహం చెయ్యరు మీతో.. ( ఏదో కొందరు వీడు నిజం చెప్పాడు..ఇలాంటి వాడే నాకు ఫ్రెండ్ గా కావాలి అనుకొనే వారు తప్పితే )

ఇలా చిన్న విషయం దగ్గరనుండి పెద్దవిషయం దాకా ప్రతి ఒక్కదానికి అబద్దం చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది... ఈ లోకంలో ఒక మనిషి మనకు దగ్గర అవ్వాలి అంటే  అబద్దాలు ఆడడం ఒక్కటే మార్గం అంటే మటుకు అలాంటి స్నేహాన్ని వదులుకోవడమే బెటర్ అని నా అభిప్రాయం.....

ఎవరితో నైనా మాటలు పెంచాలి అంటే అబద్దం.. మాటలు తుంచాలి అంటే అబద్దం.. 

అబద్దం మాట్లాడ కూడదా? అంటే మాట్లాడచ్చు.. దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది..  దాన్ని “సత్యం” కు గల గొప్పతనం అనే  నా పాత పోస్టులో  చూడగలరు...

కానీ ఒక్క విషయం ఇప్పుడు ఈ అబద్దం వల్ల కొందరి స్నేహితులు దగ్గర అయి ఉండచ్చు.. కానీ మీరు చెప్పిన అబద్దం ఏదో ఒకరోజు బయటపడినప్పుడు , ఆ స్నేహం దూరమై.. నేను అప్పుడు అలా ఎందుకు అబద్దం ఆడానా అని బాధపడి ఏ ప్రయోజనం ఉండదు......


గుండెల్లో మనపై చెప్పలేంత కసి, క్రోధం పెంచుకొని పైకి మాత్రం పెదాలపై నవ్వులు చిలకరిస్తూ..... అదనుకోసం చూస్తూ, అవకాశం వచ్చినప్పుడు తమ కసినంతా ఒక్కసారిగా వెళ్ళగక్కే వారు నిజమైన స్నేహితులేనా?....



February 24, 2012

Internet Banking ఉందా User name కూడా జర జాగ్రత్త (password ఒక్కటే కాదు)


ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఈ SBI… ఏదో users కోసం చేస్తున్నాం అనుకుంటుంది... కానీ దానివల్ల వచ్చే అనర్దాలు గుర్తించడంలేదు....

SBI internet banking సైట్‍లో మూడు సార్లు మన పాస్‍వర్డు తప్పుగా ఇస్తే మన అకౌంట్ 24 గంటలు ఇలా లాక్ అయిపోతుంది....

 

ఈ తప్పును ఇలాగే నేర్చుకోవద్దు...





           నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
   పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |  
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం 
         నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

January 17, 2012

మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా?



మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా? ఎప్పుడూ ఒకర్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం ఎందుకని ?

     ఫలానా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు లేదా ఇంజనీర్ అయ్యాడు, క్లాసులో పస్ట్ వచ్చాడు నువ్వు అలానే కావాలని అమ్మానాన్నలు చెప్తూఉంటారు. దాదాపూ మనమూ అంతే అలానే ఆలోచిస్తాం. 

January 15, 2012

భగవంతునికి మీపై నమ్మకం ఉంది, మీకు ఉందా ?



భగవంతుడు మీ  కోరికలు,  కష్టాలు తీరిస్తూ ఉన్నాడంటే ఆయనపై మీకు నమ్మకం కలిగిస్తున్నాడన్నమాట... అదే తీర్చలేదు అంటే మీ శక్తి  పై ఆయనకు నమ్మకం ఉంది అని అర్దం...

అంటే మీపై ఆయనకు ఉన్నది అపారమైన నమ్మకం అన్నమాట,  మరి మీరెందుకు నన్ను దేవుడు కరుణించలేదని బాధపడుతారు... 


ఏ పనిలోనైనా  మనం మానవ ప్రయత్నం చేస్తే దానికి దైవ సహాయం తోడవుతుంది.. అంతే కానీ అసలు పనే ప్రారంభించకుండా దేవుడా నువ్వే చూసుకోవాలి అంతా నీదే భారం అంటే ఎలా ?


కాబట్టి   మీలోని అపారమైన  శక్తిని  నమ్మడం ప్రారంభించండి.....దేవుడిని కష్టాలు రాకుండా చూడు అని ప్రార్ధించద్దు.. కష్టాలను ఎదుర్కొని నిలబడగల ఆత్మస్ధైరాన్ని ఇమ్మని ప్రార్ధిందించండి... కాదంటారా?




ఇది నా 100వ పోస్టు........

December 25, 2011

ఆత్మావలోకనం... సమస్యలకు పరిష్కారం



 అసలు సుఖం అంటే ఏంటి దు:ఖం అంటే ఏంటి ?

సుఖం :  మన మనస్సుకు అనిపించింది ఏదైనా అలాగే జరిగితే దాన్నే సుఖం అంటారు...

దు:ఖం:  మీ మనసుకు అనిపించినట్లు జరగలేదా అదే దు:ఖం అంటే.......

December 24, 2011

ఓర్పు ఎంతవరకూ ఉండాలి ?



    ఒక ఊరిలో ఒక పుట్ట ఉండేదట.. దానిలో ఒక పాము నివసిస్తుండేది.... అటువైపుగా వెళ్తున్న అందర్నీ అది కరచేదట... కాబట్టి జనం అటువైపుగా వెళ్ళాలన్నా భయపడేవారు.  

December 23, 2011

నిజమైన ప్రేమ అనేది ఎప్పుడు బయటపడుతుంది ?



     ప్రేమలో కపట ప్రేమ, నిజమైన ప్రేమ అని రెండు రకాలు ఉంటాయి... కపట ప్రేమ అనేది మనపై ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది... అలాంటి కపటప్రేమ కలిగినవారు ఎలా ఉంటారంటే .. మీరు ఏం చేస్తున్నా అందులో అవసరం లేకపోయినా ఏదో ప్రయోజనం కోసం సాయం చేస్తూ ఉంటారు.... కానీ మనపై నిజమైన ప్రేమ ఉన్నవారు మనం కష్టంలో ఉన్నప్పుడు మీరు అడకుండానే సాయం చేస్తారు, అవసరమైతే ప్రాణం అయినా ఇస్తారు.... అలాంటి నిజమైన ప్రేమ కలిగినవారు మీ చుట్టూ వుంటూ మిమ్మల్ని తిడుతూనే ఉండచ్చు... కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వారిలోని నిజమైన ప్రేమ బయటపడుతుంది.....

ఉదా: మీ తోబుట్టువులో,  బంధువులో, స్నేహితులో  మిమ్మల్ని ఎప్పుడూ  తిడుతూ, మీపై ప్రేమ లేనట్టే ప్రవర్తిస్తుంటారు.. కానీ వారిలోని నిజమైన ఆ ప్రేమ మీరు ఆపదలో ఉన్నప్పుడు కచ్చితంగా బయటపడుతుంది....కాదంటారా?

కానీ అలాంటి వారే మీరు కష్టంలో ఉన్నప్పుడు, లేదా మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు  చోద్యం చూస్తున్నట్టు చూస్తుంటే  మీకు బాధగా ఉండదా ?

ఈ రోజు నాకు అలాంటి పరిస్దితే ఎదురైంది..... ఎవరో ఏదో అనుకుంటారని మనవారిని, పరాయివారిలా చూడడం భావ్యమేనా .................?

December 19, 2011

మన మతాలపై విమర్శంచుకోవడం అవసరమంటారా?







    మతం కులం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి అని నా ఉద్దేశ్యం. అన్ని మతాలు బోధించేది ఒక్కటే     “ పవిత్రంగా ఉండడం, ఇతరులకు సేవచెయ్యడం  ”  అన్ని మతాలు శాంతినే కోరుకుంటాయి. ఇదంతా వదిలేస్తే, మనం జన్మతహా ఒక మతంలో జన్మించాం. కనుక మనం అదే ఆచరిస్తుంటాం. ప్రక్క మతం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతమాత్రం  లేదు.

December 3, 2011

ఇవి ఏ చెట్టు పువ్వులో మీకు తెలుసా?

ఇవి ఏ చెట్టు పువ్వులో మీకు తెలుసా? 

December 2, 2011

“సత్యం” కు గల గొప్పతనం


  

   పస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అయినదానికి, కానిదానికి, అసలు అబద్దం ఆడవల్సిన అవసరంలేని సందర్భాలలో సైతం  అబద్దాలు ఆడడం గమనించవచ్చు... అసలు సత్యానికి ఉన్న గొప్పతనం ఇక్కడ తెలుసుకోండి.

November 29, 2011

అసలు మనుషులు ఇలా ఎందుకు ఉంటారు ?



     అసలు మనుషులు ఇలా ఎందుకు ఉంటారు.... నాకు జీవితం గురించి గానీ మనుషుల మనస్తత్వాల గురించి గానీ ఏమీ తెలియవు కానీ నా ద్రుష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు వల్ల ఇలా రాస్తున్నాను..
అసలు మనుషులలో ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. ఒకరితో ఒకలాగా మరొకరితో మరోలాగా ఉంటారు...

November 28, 2011

నా స్కూల్ డేస్ నాకు మళ్ళీ కావాలి....




      ప్రస్తుతం నాకు exams అన్నీ అయిపోయినందున కొంచెం ఖాళీగా ఉన్నాను..ఇంట్లో ఊరకే ఉండడం ఎందుకు అని ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే మా స్కూలుకు వెళ్దాం అని అనిపించింది. అనుకున్నదే తడవుగా బయలుదేరిపోయాను. నాకు ఒక్కటే సందేహం, అసలు మా సార్లు నన్ను గుర్తుపడతారా లేదా? అని.... సరే గుర్తులేక పోతే గుర్తు చేద్దాం అని నాకు నేనే అనుకొని వెళ్ళాను..

July 3, 2011

క్యాలండర్‍లపై దేవుడి బొమ్మలు అవసరమా ?



ముందుమాట:  ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.

June 8, 2011

మనవారి దగ్గర మెప్పు అవసరమా ?


   
         మనవారి దగ్గర మెప్పు అవసరమా? అంటే అందరూ ఎందుకు అని అనడం నిజమే. నిజానికి మనిషి ఏ పని చేసినా కానీ తనకు ఒక రకమైన ప్రాధాన్యత వస్తుంది అన్న భావనలోనే చేస్తూ ఉంటాడు.

May 21, 2011

రియాల్టి షో లా లేక సర్కస్ ఫీట్లా ?



           ఈ మద్య అన్ని చానల్స్ లో ను రియాల్టి షో లు ప్రదసిస్తున్నారు.....వాటిని చూస్తుంటే ఎదో సర్కస్ షో ను చూస్తున్నట్టు ఉంది.  గాలిలోకి ఎగరడం, రింగుల మధ్యనుంచి దూకడం.

May 20, 2011

చదువు చదివితే వస్తుందా లేక చదివిస్తే వసుందా ?


          
           మొన్న ఈ మధ్యన మా స్నేహితుని ఇంటికి వెళ్ళాను...వాళ్ళ ఇంటి ఓనర్ కు ఒక అబ్బాయి ఒక అమ్మాయి..అయితే ఆ పాపకు ఏడవ తరగతి పరీక్షలు అనుకుంటాను, వాళ్ళ అమ్మ చదివిస్తుంది...ఆమెకు ఏదో ఇంట్లో పని ఉండి లోపలికి వెళ్తూ ఎక్కడ చదవడం అపేస్తుందో అని తమ్మున్ని కాపలా పెట్టింది. ఈ పాపకు చదవాలని లేదు..
Related Posts Plugin for WordPress, Blogger...