January 17, 2012

మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా?



మన కంటూ ఏమీ కొత్త ఆలోచనా విధానాలు ఏమీ ఉండవా? ఎప్పుడూ ఒకర్ని గుడ్డిగా ఫాలో అయిపోతుంటాం ఎందుకని ?

     ఫలానా వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు లేదా ఇంజనీర్ అయ్యాడు, క్లాసులో పస్ట్ వచ్చాడు నువ్వు అలానే కావాలని అమ్మానాన్నలు చెప్తూఉంటారు. దాదాపూ మనమూ అంతే అలానే ఆలోచిస్తాం. 

వాడు ఆపని చేసాడా? నేను చెయ్యలేనా ఏంటి.. అనుకుంటూ, మన సమయాన్ని సైతం వృధా చేసుకోని మరీ అదేపని చేసి చూపిస్తాం. అసలు మీరు చెయ్యలేరని ఎవరైనా అన్నారా? . ఏమి మీరు వాళ్ళు చేసిన పనే, అలాగే  ఎందుకు చెయ్యాలి? మనం కొత్తగా ఎందుకు ప్రయత్నించకూడదు ? అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? 

     ఒకర్ని ఆదర్శంగా తీసుకోవడం మంచిదే కానీ వారిలాగానే చెయ్యాలి అని చెప్పి వారినే అనుకరించడం మాత్రం దండగ..

ఉదా: ఎక్కువగా కధలు చదివే వాళ్ళకు కధలు రాయాలి అని అనిపించడం లాంటివి అన్నమాట...

      మనుషులలో నేను గమనించిన మరో విషయం ఏంటంటే  ఎదుటివారి నుంచి చెప్పించుకోవడం అంటే మహా చిరాకు.. వీడేంది నాకు చెప్పేది నాకు తెలియదా ఏంటీ?  (ఇగో ఫీలింగ్ అన్నమాట), తనకు తెలియనిది తెలియదు అని ఒప్పుకోవడానికి అస్సలు ఒప్పుకోరెందుకో....

ఎవరైనా ఈ విషయం నీకు జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్తుంటే వినరు..నాకు ఇప్పుడది  అవసరం లేదు ఆ విషయం తెలుసుకోని నేనేం చేస్తా? అంటారు.. కానీ ఇంకొన్నాళ్ళకు అదే విషయం అవసరమైనప్పుడు తంటాలు పడి మరీ నేర్చుకుంటూ నాకు చెప్పేవాళ్ళు లేక పొయ్యారు అని బాధపడుతుంటారు...అంతే కానీ అప్పుడు అతను చెప్పినపుడు ఎందుకు వినలేదా అని మాత్రం బాధపడరు.... జీవితంలో ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని ఎవరైనా చెప్తే .. అబ్బో వీడికే  ఉందిలే బోడి లైఫ్ అంటారు..
కానీ ఏం చేస్తాం అందరూ  మనలాగే ఆలోచించాలనీ రూలేమీ లేదు కాబట్టీ మనం ఏమీ చెయ్యలేం.

చివరగా ఒక్కమాట  ప్రతి మనిషిలోనూ కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు  ఉంటాయి.. ముందు అని ఏమిటో తెలుసుకొని ఆ రకంగా ముందుకు వెళ్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు.....  ఎప్పుడూ ఒకర్ని అనుకరించద్దు.. ఆదర్శంగా తీసుకోండి.....


ఏమైనా తప్పుగా రాస్తే పెద్ద మనసుతో క్షమించగలరు...

13 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ధ్యాంక్యూ కొండలరావుగారు...

    ReplyDelete
  3. చాలా బాగా రాసారు .....
    అందరం అంతే ......

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్యూ సీత గారు.. అందరం అంటే నన్నూ కలుపుకొనే కదా మీ ఉద్దేశ్యం..
      హహ అంతే లేండి....

      Delete
    2. హహ ....మీరు అని నా ఉద్దేశ్యం అయితే కాదు సాయి గారు ....మీరు నా లాగా అని ఒప్పుకున్నారు కదా...!!!మొదట్లోనే..

      Delete
  4. సాయి గారు మీరు చిప్పిన విడహనం భాగుంది. ఇలా అందరు ఆదర్శంగా తెర్చుకోవటం లో తప్పులేదు కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు పులి లాగ మారేది ఎప్పటికి అని ఆలోచించటంలేదు అందుకు ఎందుకు ఇలాగ జరుగుతున్నది అందుకు గల కారణాలు పరిష్కారాలు త్వరలోని నా బ్లాగ్ లో కూడా వ్రాస్తాను దీనిమీద http://swarajyam.blogspot.com/2012/01/too-impartent-experience-in-my-life.html

    ReplyDelete
  5. బాగనే చెప్పారు సాయి గారు. ఎదైనా చెప్పె వాళ్ళ ఉద్దేశం ఆ క్షణంలో ఎలా ఉంటుందో దానిని బట్టే, స్వీకరించే వారి సైకాలజీని బట్టీ ఉంటుంది. ఎవరైనా అడగకుండా సలహాలు చెప్పెవాళ్ళు బాద్యతతో చెప్పరు బాద్యతతో చెప్పరు. అది మికూ తెలిసే ఉంటుంది.

    ReplyDelete
  6. Hi Sai gaaru,

    I would like to talk to you on a specific issue...Cai I get your personal email Id. or you can reach me at vara.9960@gmail.com

    ReplyDelete
    Replies
    1. వేణుగారు.., వెన్ను రవి గారు, వర గారు.. ధ్యాంక్యూ అండీ..

      Delete
  7. బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. నారాయణ స్వామి గారు.(కొత్తపాళీ గారు )
      నా బ్లాగుకు స్వాగతం అండీ.. మీ రాక చాలా సంతోషం, కామెంటినందుకు ఇంకా సంతోషం..
      మీ బ్లాగులంటే నాకు చాలా ఇష్టం అండీ..

      Delete
  8. నలుగురూ నడిచే దారిలో వెళితే సులువుగా వుంటుంది కదండీ...కొత్త బాటలో ముళ్ళూ రాళ్ళూ తీసుకుంటూ వెళ్ళే ధైర్యం కావాలి కదా..

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...