వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ ||
బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలురాగా |
పలుకుల తేనియ లొలుక చెంత చిలుకలు కలకల పలుక |
రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలుక || -|వచ్చెను|
రంభాది సతులెల్ల చేరి యెదుట గంభీర గతులను మీర |
నటనా రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి || -|వచ్చెను|
మీ స్పీకర్లు ఆన్ చేసుకుంటే ఈ సంకీర్తన వినవచ్చు...
No comments:
Post a Comment