January 1, 2012

ఇక అంతా మంచే జరుగుతుంది





మన జీవితంలోకి మరో క్రొత్త సంవత్సరం వచ్చేసింది..
ఈ క్రొత్త సంవత్సరంలో మీరందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీ జీవితం ఆనందంగా గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

మరిచి పోయాను ఈ సంవత్సరం అందరికీ మంచే జరుగుతుంది లేండి... ఉదయాన్నే అందరూ బాగుండాలి అని దేవుడికి కొబ్బరి కాయ  కొట్టాను.. చూశారా  అసలు నీళ్ళే లేవు అంతా పువ్వే వచ్చింది...కాబట్టి ఇక అందరికీ మంచే జరుగుతుంది.

 ఇంతకీ దేవుడిని ఏమని కోరుకున్నారు?

    ఎందుకు అడిగానంటే నా స్నేహితులని కొందర్ని అడిగినపుడు వారు చెప్పిన సమాధానం విని నాకు నవ్వు వచ్చింది లేండి. అందుకని..  వారు ఏమని చెప్పారంటే నాకు  ఎటువంటి ఆటంకాలు, కష్టాలు రాకుండా, జీవితంలో విజయాన్ని సాధించేట్లుగా చేయమని

    జీవితం అన్నాక కష్టాలు, బాధలు, ఆటంకాలు లేకుండా ఉంటాయా చెప్పండి.. అలా కాదురా  నాకు జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించగల ఆత్మస్ధైర్యాన్ని ప్రసాదించు అని కోరుకోవాలని చెప్పాను... కాదంటారా?




3 comments:

  1. మీరు కోరుకున్నట్టే అందరికీ మంచే జరగాలని మేమూ కోరుకుంటూ...
    మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

    ReplyDelete
  2. సాయిగారు..!
    మీకు మీ కుటుంబ సభ్యులకు 2012 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

    ReplyDelete
  3. చిన్నిఆశ గారు, వామనగీత గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...