January 1, 2012

భలే FaceBook




      కొన్ని రోజుల క్రితం ఈ ఫోటో facebook లో చూసి నవ్వుకున్నాను కానీ అది మాత్రం నిజం.      ఎవరు తయారు చేసారో గానీ నిజంగా హ్యాట్సాప్...  కావాలంటే నా విషయం లోనే చూడండి.. ఎంతమంచి కొటేషన్ రాసినా నాకు ఇప్పటికి వచ్చింది. రెండు లైక్స్ మాత్రమే, కానీ ఎవరో అమ్మాయి మాత్రం Hiiii..అని రాస్తే 6,7 comments, likes .

     అసలు ఇంతకీ ఈ యువతకి ఏం కావాలో తెలుసా?  కల్లుచెదిరించే రకరకాల గ్రాఫికల్ ఎఫెక్టులతో కూడిన  స్కాపులు, ఫోటోలు, నవ్వించే జోకులు లాంటి మార్ఫింగ్ చేసిన బొమ్మలు అంతే... మంచి చెప్తే ఎవ్వరికీ ఎక్కదు... అసలు దాని గురించే పట్టించుకోరు.. తమకు తెలియదు, తెలిసిన వారి దగ్గర చెప్పించుకోవడానికి ఇగో ప్రాబ్లం.  

      జీవితంలో నవ్వు అనేది ఉండాలి... కానీ విడిపోయిన మిత్రులను కలపడానికి అన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన సోషల్ నెట్వర్కింగ్ అంతా ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు,  తప్పుడు ప్రచారాలు  share చేస్తూ వెల్లకూడదు కదా ?
       కొన్ని updates చూస్తే ఏం చేయాలో అర్దం కాదు... share this very important అంటూ మనల్ని ఆర్డర్ వేస్తుంటాయి.. అదేంటో మనం చూసి మనకు నచ్చితేకదా share చెయ్యాలి ఇలా ఆర్డర్ వేస్తే ఎలా? తీరా చూస్తే అది ఎంత సింపుల్ విషయం అంటే... మీ ఫేస్ బుక్ అకౌంట్ జాగ్రత్త

    అసలు ఈ  మధ్య స్నేహం అనేది భలే విచిత్రంగా తయారైంది.ఉదాహరణకి:
 1.  నిన్న నీకు ఇది చేసాను కదా..నాకోసం ఈరోజు ఇది చెయ్యి..లేకపోతే నీతో కట్టు...
2.  నేను నిన్న చాట్ స్టార్ట్ చేసాను.. ఈ రోజు నువ్వు చెయ్యచ్చుగా.. 
3. మాట్లాడితే నీకు ఫ్రెండ్ షిప్ వ్యాల్యూ తెలీదు... అని అనడం వీడికేదో తెలిసినట్టు...

ఈ బిజీబిజీ  కాలంలో నవ్వుకోవడమే మరిచిపోతున్న వారికి ఇలాంటి Jokes అవి అవసరమే గానీ, మరీ ఎక్కువచెయ్యద్దు అని నా ఉద్దేశ్యం.. ఇలా చేస్తూపోతే social networking అంతా జోకులమయం అనుకుంటారు....






12 comments:

  1. సాయి గారు..!
    సూపర్‌గా చెప్పారు..!

    ReplyDelete
  2. Thank you.. వామన గీత గారు.. మీ పేరు చెప్పగలరా?

    ReplyDelete
  3. Why don't you visit my fb profile...?
    http://www.facebook.com/subrahmanyasarma.salagrama

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. అయ్యో..అదేం కాదండి.. request పెట్టాను... password మరిచిపోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది

    ReplyDelete
  6. really super ...each and every line is true..

    ReplyDelete
  7. Thank you.. సుభ గారు...

    ReplyDelete
  8. బాగా చెప్పరు లెండి. నేను ఈమద్య ఫేస్‌బుక్‌లోకి సరిగ్గా వెళ్ళడమే మానేసాను

    ReplyDelete
  9. correct.................
    and inkoti naku ila facebook lo images pedutunnaru ga avi site nundi cut cheyadaniki edaina software unte please update it..................

    ReplyDelete
    Replies
    1. Creator గారు మీరు అడిగినది నాకు సరిగా అర్దం కాలేదు.. కాని ఇవి మీకు ఉపయోగపడుతాఏమో చూడండి.

      https://chrome.google.com/webstore/detail/fpjnpabklnaaifclgealaepelncljadk# అనే లింకులో ఉండే chrome extension తో ఏ ఫోటో అల్బమ్ నైనా ఒక్క క్లిక్ తో download చెయ్యవచు..

      అలాగాక ఆ ఇమేజస్ ఎక్కడైనా వాడాలి అంటే ఎలా అంటారా? రైట్ క్లిక్ చేసి copu image URL option ద్వారా లింకు కాపీ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు....

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...