ఎంత విభవము కలిగె అంతయును ఆపదని
చింతించినది కదా చెడని జీవనము || -(2)
చలము కోపంబు తను చంపేటి పగతులని
తెలిసినది అది కదా తెలివి |
తలకొన్న పరనింద తనపాలి మృత్యువని
మెఱయు విషయములే తన మెడనున్న వురులుగా
యెరిగినది అది కదా యెరుక |
పఱివోని ఆస తను పట్టుకొను భూతమని
వెరచినది యది కదా విజ్ఞాన మహిమ || ||ఎంత||
యెనలేని తిరువేంకటేశుడే దైవమని
వినగలిగినది కదా వినికి |
అనయంబు అతని సేవానందపరులై
మనగలిగినది కదా మనుజులకు మనికి || ||ఎంత||
చాలా మంచి కీర్తన ఇచ్చారు, ఎన్నెన్నో నెనర్లు.
ReplyDelete