January 1, 2012

ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు






 ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు |
 అంతరాతరములెంచి చూడ  పిండంతేనిప్పటి అన్నట్లు ||




కొలుతురు మిము వైష్ణవులు  కూరిమితో విష్ణుడని...
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు |
తలతురు మిము శైవులు  తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచు ||


సరి నెన్నుదురు శాక్తేయులు  శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధములను  తలపుల కొలదుల భజింతురు |
సిరుల మిము నే అల్పబుద్ది దలచిన  వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన ఘన బుద్దులకు ఘనుడవు ||


నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు |
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈవల నే నీ శరణననెదను ఇదియే పర తత్త్వము నాకు ||






ఇక్కడ చూస్తూ వినండి:




బాలకృష్ణ ప్రసాద్ గారు.. లక్షగళార్చన కోసం   పాడిన ఈ పాటను నేను ఈ వీడియోలో ఉంచాను.....


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...