Showing posts with label కలగూరగంప. Show all posts
Showing posts with label కలగూరగంప. Show all posts

June 7, 2012

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు





సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు  
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది  
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి  
కొమ్మ విరగకుండా పూలు కోయండి  
అందులో పూలన్నీ దండ గుచ్చండి  
దండ తీసుకుని వెళ్ళి సీతకియ్యండి  
దాచుకో సీతమ్మ రముడంపేడు  
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు  
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మా  
దాచుకోకుంటేను దోచుకుంటారు.


ఈ మధ్య ఒక   సినిమా పేరు చూడగానే ఎప్పుడో చిన్నప్పటీ ఈ గేయం జ్ఞాపకం వచ్చింది ఇలా పోస్టు చేసాను....



June 4, 2012

ఈ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించండి


 గమనిక:  మీ నెట్ కనెక్షన్ స్లో అయితే పూర్తిగా లోడ్ అయ్యేవరకూ కొంచెం ఓపిక పట్టండి..

May 19, 2012

నిజమైన బార్బీ బొమ్మని (అమ్మాయిని) ఎప్పుడైనా చూసారా ?





   ఈమె పేరు  KOTAKOTI. వయసు 16 అంట. చూసారా... నిజమైన బార్బీ బొమ్మలానే ఉంది కదూ.....ఈ మధ్య ఇంటర్నెట్ లో బాగా ఫేమస్ అయ్యింది లేండి..

May 17, 2012

మనిషి ఎప్పుడు మారతాడు ? -- నా పిచ్చి ప్రశ్నలు

నా  పిచ్చి ప్రశ్నలు సమాధానాలు.........


తలకు రంగు ఎప్పుడు వెయ్యలని అనిపిస్తుంది ?

జుట్టు నెరిసిన తరువాత 

వస్తువు విలువ ఎప్పుడు తెలుస్తుంది ?
దాన్ని  పోగొట్టుకున్నాక

ట్రిమ్ గా ఉండాలి అని ఎప్పుడు అనిపిస్తుంది ?
అందమైన అమ్మాయి పరిచయం అయ్యాక

పనిచెయ్యాలని ఎప్పుడు అనిపిస్తుంది ?
ఉద్యోగం వచ్చేదాకా...

నియోజక వర్గం  ఎప్పుడు గుర్తొస్తుంది ?
ఎన్నిక ప్రకటన తరువాత

కోడలుకు స్వేచ్చ ఎప్పుడు వస్తుంది ?
అత్త ఊరు వెళ్ళాక

ప్రేమ విలువ ఎప్పుడు తెలుస్తుంది ?
ప్రేమ దూరం అయ్యాక

ఆదర్శదాంపత్యం అంటే ఏలా ఉంటుంది ?
భార్య స్టవ్ వెలిగిస్తే, భర్త వంట చెయ్యడం
భర్త బట్టలు ఉతికితే, భార్య ఆరేయడం
భర్త ఇల్లు తుడుస్తుంటే, భార్య ఫ్యాన్ స్విచ్ వెయ్యడం..... ఇలా అన్ని పనులు సమానంగా పంచుకోవడం

మనిషి ఎప్పుడు మారతాడు ?
మనిషా.... అది ఎప్పటికీ జరగని పని నాయనా............
(యుగ యుగాలు గడిచినా మనిషి నైజాన్ని మార్చడం ఎవ్వరి వల్లా జరగని పని)

-- గమనిక నేను ఇది తమాషాగా రాసాను....సీరియస్ గా తీసుకోవద్దు..ప్లీజ్....... ఊరకనే నవ్వుకోవడానికి.. సరేనా......

May 16, 2012

ఇలాంటి శుభలేఖ ఎప్పుడైనా చూసారా ?



ఇలాంటి శుభలేఖ ఎప్పుడైనా చూశారా?  మాధ్స్ చెప్పేవాళ్ళకు శుభలేఖల పనులు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది మరి... ఏం చేస్తాం........ 




May 9, 2012

నీ చిరునవ్వే నా గమ్యం నేస్తం


ఓ నేస్తం...

భారమైన నా హృదయానికి ఓదార్పు నీ స్నేహం
అశాంతితో నిండిన నా మనసుకు ఆదరింపు నీ స్నేహం
ఆవేదనతో రగులుతున్నప్పుడు ఓ చల్లని పలకరింత నీ స్నేహం
ప్రవాహంలా జాలువారే నా కన్నీటికి ఓ అడ్డుకట్ట నీ స్నేహం
అలసిన నా కన్నులలో కమ్మని కల నీ స్నేహం


అస్తమిస్తున్న నా జీవితానికి వెలుగునుచూపిన సూర్య కిరణం నీవు


అందుకే  ఓ నేస్తం నీ చిరునవ్వే నా గమ్యం

నా పెదవులపై ఈ దరహాసం విరిసిందీ నీ కోసమే..
కానీ నా నవ్వుకూ నీ నవ్వుకూ చిన్న తేడా ఉంది నేస్తం


నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతావు
నేను నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాను


కమ్మని కలల్లా క్షణకాలమే మిగిలే ఈ జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక గుర్తువునీవు....
నన్ను మరు(విడు)వకు  నా నేస్తం ఎన్నటికీ....
మిగిలిపోతా నీ స్నేహం అనే సముద్రంలో ఒక బిందువులా..............


--సాయి



March 22, 2012

నా ఉగాది శుభాకాంక్షలు...





తెలుగు వారి తొలిపండుగ ఉగాది
షడ్రుచుల సమ్మేళనం ఉగాది
కోయిల కుహూకుహూ రాగాలకు అంతరార్దం ఉగాది
కొమ్మల చిగురుల వన్నెలకు అర్దం ఉగాది
పాడిపంటల పచ్చదనాలకు, రైతన్నల ఆనందాలకు ఆలంబనం ఉగాది
ఆటపాటలకు, సప్తస్వర సమ్మేళనాలకు, పంచాంగ శ్రవణాలకు వేదిక ఉగాది
నూతన ఆశలను, కోట్లు కుమ్మరించినా కొనలేని ఆనందాలను అందించేను ఈ ఉగాది
అందుకే సాదరంగా సాగనంపండి ఆఖరను
ఉప్పొంగిన ఆనందంతో వెల్లివిరిసిన సంతోషంతో ఆహ్వానించండి ఈ నందనం ను మీ 
ఇంట  ఆనందం నింపాలని....
నందన వనంలో మనజీవనం నవనవ లాడాలని ఆశిస్తూ.....

--సాయి

February 24, 2012

Internet Banking ఉందా User name కూడా జర జాగ్రత్త (password ఒక్కటే కాదు)


ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఈ SBI… ఏదో users కోసం చేస్తున్నాం అనుకుంటుంది... కానీ దానివల్ల వచ్చే అనర్దాలు గుర్తించడంలేదు....

SBI internet banking సైట్‍లో మూడు సార్లు మన పాస్‍వర్డు తప్పుగా ఇస్తే మన అకౌంట్ 24 గంటలు ఇలా లాక్ అయిపోతుంది....

 

ఈ తప్పును ఇలాగే నేర్చుకోవద్దు...





           నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
   పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |  
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం 
         నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

February 19, 2012

శివరాత్రికి ఈ కోతిపిల్లలా మీరు ఉపవాసం చెయ్యగలరా ?



ముందుగా బ్లాగర్లు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.....  శివరాత్రికి చాలా మంది ఉపవాసం, జాగారం చేస్తుంటారు...
ఉపవాసం అంటే అర్దం తెలుసా? 
ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించడం.... సో... దేవునికి దగ్గరగా నివసించడం అన్నమాట.. మనం కడుపునిండుగా తింటే ఇక దేవునిపై మనసు లగ్నం కాదు కదా అందుకని ఇలా ఉపవాసాలు ప్రవేశపెట్టారు... ఉపవాసంలో  ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చు(పాలు, పండ్లు లాంటివి) .....అంతేకానీ మరీ కటిక ఉపవాసాలు చేసినా  మనసు ఆయనపై లగ్నం కాకపోతే మాత్రం  అది బూడిదలో పోసిన పన్నీరే....
శివరాత్రి రోజు ఆ మహాశివుడు మనకు వరాలివ్వడానికి భూమి మీదకు వస్తాడు అని అంటారు.. కాబట్టి ఆయన రాకకోసం మనం వేచి ఉన్నాం అని తెలియజేయడానికి జాగరణ చేస్తాం....
అయ్యో అసలు చెప్పాలనుకుంది ఇది కాదే...........
ఆ.........ఉపవాసం గురించి వెదుకుతుంటే ఈ కధ దొరికింది........ ఈ కధలో కోతిపిల్ల శివరాత్రికి  భలే ఉపవాసం చేసింది లేండి.. తనతో పాటు తన పక్కనున్న అందరి ఉపవాసాన్ని ఎలా భగ్నం చేసిందో తెలుసా ? 
అబ్బా చదువుతుంటే నవ్వుఆగలేదు...  మీరూ ఇక్కడ చదువుకోండి


February 5, 2012

పిల్లల్లో ఊహా శక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్....

    
నేటి ఇంటెర్నెట్ యుగంలో పిల్లలు కార్టూన్ లు చూడటనికి తద్వారా దృశ్య మాధ్యమానికి బాగా అలవటుపడిపోతున్నారు.ఏదైన వినటం ..అర్ధం చేసుకోవటం .. ఊహించుకోగలగటం వంటి మంచి అలవాటుని తెలియకుండానే కోల్పోతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అన్ని సమస్యల కి ముఖ్య కారణం పక్క వారి సమస్యలను సావధానం గా విని అర్ధం చేసుకోకపోవటమే!!


January 29, 2012

మీ మాటలను రిపీట్ చేసే చిలక (ఈ చిలకకి మాటలు నేర్పించండి)





మన మాటల్ని రిపీట్ చేసే పిల్లి అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చూసే ఉంటారు... కదా... అలాంటిదే మన మాటల్ని రిపీట్ చేసే చిలక కావాలా? అదీ కంప్యూటర్ లోనే పనిచేసే అప్లికేషన్ (ఫోన్లలో కాదు).

January 18, 2012

ఇంటర్నెట్ స్పీడ్ లో Kbps కు kBps కు తేడా



మనకు ఇంటర్నెట్ ప్రొవైడర్లు  256 kbps, 1 Mbps కనెక్షన్లు అని  ఇస్తుంటారు..కానీ డౌన్లోడ్ స్పీడ్ మాత్రం అంత ఉండదు... ఎందుకోతెలుసా? 

January 14, 2012

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అధ్భుతమైన గ్రీటింగ్స్ కార్డులతో


నా బ్లాగు వీక్షకులందరికీ భోగి, సంక్రాంతి మరియూ కనుమ  శుభాకాంక్షలు... మీకోసం ఈ గ్రీటింగ్ కార్డులు...

January 12, 2012

మేలుకో, నడు, లక్ష్యాన్ని సాధించు



(ఈ రోజు స్వామివివేకానంద జయంతి, యువజనోత్సవం)

January 10, 2012

నేను చేసిన చార్జింగ్ లైట్...(My Creativity) ఎలా ఉందో చూసి చెప్పరూ....




    ఉదయాన్నే ఇంట్లో ఉండే పని చెయ్యని వస్తువులని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను... ఇలా పని చెయ్యని దోమలు చంపే బ్యాట్ +  ఒక పని చెయ్యని టార్చిలైట్ కనిపించాయి.. వెంటనే ఆలోచన తట్టింది. రెండింటిని కలిపి ఒక పనిచేసే వస్తువు చెయ్యచ్చుకదా అని.... వెంటనే పని ప్రారంభించాను... అరగంటలో ఇలా చేసేసాను.... ఆ పనిచెయ్యని బ్యాట్ లో ఉన్న బ్యాటరీని వాడి...ఈ పనిచెయ్యని టార్చిలైట్ ని వెలిగించాను... 



ఆ...... ఏముంది..దాని వైర్లు తీసి దీనికి పెట్టాను అని అనుకుంటున్నారేమో... కాదండి... బ్యాట్ లోని నెట్ కి వచ్చేది AC (ఆల్టర్ నేటివ్ కరెంట్)..అంటే దానిలో బ్యాటరీ (DC) నుండీ AC కి మార్చే యూనిట్ ఉంటుంది...జాగ్రత్తగా ఆ యూనిట్ కు supply వెళ్ళకుండా సర్కూట్ బ్రేక్ చేసి + ఇంకొన్ని మార్పులు చేసి ఇలా చేసాను.. ఇక చక్కగా చార్జింగ్ పెట్టుకోవడం..వాడుకోవడం అంతే... బాగుందా?

మీ డౌట్ నాకు అర్దమైంది ఇంతకూ అది వెలుగుతుందా లేదా అనే కదా ?
కావాలంటే చూడడండి బాగానే వెలుగుతుంది...


ఇలాంటివి చిన్నప్పుడు చాలా చేసే వాడిని.... ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చాక దీనికే అతుక్కుపోవడం వల్ల కొంచెంతగ్గాయి.... నిజానికి అసలు ఆ బ్యాటరీ వాడి పాత మెబైల్ బాగు చెయ్యాలని అనుకున్నాను కానీ టాటా ఇండికాం పుణ్యమా అని ఏ సిమ్‍కార్డు పని చెయ్యడం లేదు..ఇక దానికి చేసిన వేస్టు అని ఇలా చేసాను...
ఇంతకూ నా క్రియేషన్ ఎలా ఉంది ?

January 9, 2012

ఈ ఫోటోలకు మంచి కామెంట్ రాయగలరా?.....

ఈ ఫోటోలకు మంచి  కామెంట్ రాయండి....

January 8, 2012

ఇవి నిజంగా కదులుతున్నాయా?


ఈ ఫోటో లో ఉన్న పసుపుపచ్చ బాల్స్ నిజంగా  కదులుతున్నాయా? చెప్పండి చూద్దాం ?











Source: FaceBook

మీ గురించి 10 నిజాలు.....




అన్నీ నిజాలే  కదూ... మెన్న Facebook లో చూశాను...బాగుంది కదా అని ఇలా పోస్టు చేశాను....




.

Invisible Mobile phone చూశారా ?



    టెక్నాలజీ రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉంది... రకరకాల ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అలానే ఇది చూశారా  Invisible mobile. గ్లాస్ లాగా ఎలా ఉందో...
Related Posts Plugin for WordPress, Blogger...