నేటి ఇంటెర్నెట్ యుగంలో పిల్లలు కార్టూన్ లు చూడటనికి తద్వారా దృశ్య మాధ్యమానికి బాగా అలవటుపడిపోతున్నారు.ఏదైన వినటం ..అర్ధం చేసుకోవటం .. ఊహించుకోగలగటం వంటి మంచి అలవాటుని తెలియకుండానే కోల్పోతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అన్ని సమస్యల కి ముఖ్య కారణం పక్క వారి సమస్యలను సావధానం గా విని అర్ధం చేసుకోకపోవటమే!!
అలాగే భార్యాభర్తలు ఇద్దరూ పని చేయవలసిన అవసరం యేర్పడిన ఈ రోజుల్లొ పిల్లలతో గడిపే సమయం ఎంత లేదన్నా కూడా బాగా తగ్గింది.ఉన్న కాస్త సమయం లో ఏ కధలు చెప్పాలి? ఎలా చెప్పాలి ? అని ఆలొచించే తల్లిదండ్రులు యెంతో మంది. అలాంటి వారికి ఈ "కథాసుధ " అనే ఛానల్ బాగా ఉపయోగపడుతుంది......
రోజూ మనం మట్లాడుకునే వాడుక భాషలో సాధ్యమైనంత సులభంగా పిల్లలకి అర్ధం అయ్యేలా కధలను అందించడానికి ప్రయత్నిస్త్తున్నారు..దీని వెనుకున్న ముఖ్యోద్దేశం పిల్లల్లో ఊహా శక్తిని మరియు వినే అలవాటు ని పెంపొందించాలనుకోవటమే !
దీనిని శిరీష గారు నడుపుతున్నారు...... ఇప్పటికి ఈ ఛానల్ లో దాదాపు 17 అందమైన కధలను అందించారు...ఇంకా అందించబోతున్నారు..
తెలుగు కధలను ఆడియో ఫార్మాట్ లో మన ముందుకు తీసుకొచ్చే చిన్న ప్రయత్నం చేస్తున్న ఈ సైట్ ను ప్రోత్సహించండి...
ఛానల్ లింక్: http://www.youtube.com/shsireesha
సింహం - చిట్టెలుక కధ
ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి...
No comments:
Post a Comment