రాగం: పాడి
సంకీర్తన-146
volume-4
PageNo-98
అగ్రపూజ గొన్నవాడు ఆది సింహము ||
దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ
దేవులతో కూడున్నాడు దివ్యసింహము |
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము ||
అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెస గొలువున్నాడు వీరసింహము |
పసిడి వర్ణముతోడ బహుదివ్యాయిధాలతో
దెసల వెలుగొందీని ధీరసింహము ||
నానాభరణాలు వెట్టీ నమ్మిన దాసుల నెల్ల
ఆనుకొని రక్షించీ ప్రత్యక్షసింహము |
పూని శ్రీ వేంకటాద్రిని బుదులెల్లా కొలువగా
నానా వరములొసని మానవ సింహము ||
గమనిక: నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...
No comments:
Post a Comment