రాగం: నాట
Volume-18
Page No-140
సంకీర్తన -209
గద్దెమీద కూచున్నాడు కంబములో పుట్టినాడు
కొద్దిమీర కడు నవ్వుకొంటానున్నాడు |
వొద్దనె శ్రీసతి చన్ను లొరయిచున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు ||
పెను మీసాలవాడు పెదపెద గోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని కాచుకున్నాడు |
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుప తేజుడమ్మ అహోబలేశుడు ||
వేవేల చేతులవాడు వెన్నెల ఛాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు |
శ్రీ వేంకటగిరి మీద చేరి భవనాశిదండ
ఆవల నీవల మించె అహోబలేశుడు ||
గమనిక: నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...
bhavanaaSi annadi padam naayanaa !! sarichEsukOgalavu.[aakhari charaNam lOnidi.]
ReplyDeleteజయప్రభ గారు.. ధ్యాంక్యూ వెరీమచ్... తప్పుని చెప్పినందుకు... మార్చాను.ఇప్పుడు ఒకేనా ?
Delete