కీర్తన: 334 ; రేకు : 59
Volume: 15 (ఆధ్యాత్మ సంకీర్తనలు)
Page no: 225
దేవుడొక్కడే మఱి జీవులు వేరు
వావాత తెలిసేది వారి వారి భాగ్యము ||
గడియలొక్కటే వారిగతులు వేరు |
బడి పుణ్యములు సేయ పాపములు సేయగ
కడగి కాల మెక్కటే కర్మములేవేరు ||
కాకములు సంచరించె కలహంసలు తిరిగె
ఆకాశమెక్కటే విహారాలు వేరు |
మేకొని యెండలు కాయ మించి చీకటులు రాయ
లోకపు బయలొక్కటే జోకలే వేరు ||
అట్టే ఏలే రాజులకు నడిగేటి దీనులకు
పట్టి భూమి ఒక్కటే బాగులు వేరు |
గుట్టున శ్రీ వేంకటేశు గొలువగ దలచగ
నెట్టిన దేహమెక్కటే నేరుపులే వేరు ||
గమనిక: నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...
మంచి ఆలొచన సాయి గారు....
ReplyDeleteఇలానె మంచివి అందించండి...
ఈ పాట చాల బగుంది..