రేకు: 1883
ఇహపరములకును ఏలికవు
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
చ|| వేయికరంబుల వివిధాయుధంబుల
దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
చ|| కదిమి దుష్టులను గతము చేసితివి
త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు
కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
Vol: 22
రాగం: శంకరాభరణం
రాగం: శంకరాభరణం
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||
చ|| వేయికరంబుల వివిధాయుధంబుల
దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||
చ|| కదిమి దుష్టులను గతము చేసితివి
త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||
చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు
కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||
అన్నమాచార్యుల సంకీర్తనలను మన అందరికీ అందిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు...నాకు అంతర్జాలంలో కనపడని పాటలను ఆడియోతో సహా అందించాలన్న నా చిన్ని ప్రయత్నం......
ReplyDeleteఏదైనా అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...
ReplyDelete