ప్రస్తుతం నాకు exams అన్నీ అయిపోయినందున కొంచెం ఖాళీగా ఉన్నాను..ఇంట్లో ఊరకే ఉండడం ఎందుకు అని ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుంటే మా స్కూలుకు వెళ్దాం అని అనిపించింది. అనుకున్నదే తడవుగా బయలుదేరిపోయాను. నాకు ఒక్కటే సందేహం, అసలు మా సార్లు నన్ను గుర్తుపడతారా లేదా? అని.... సరే గుర్తులేక పోతే గుర్తు చేద్దాం అని నాకు నేనే అనుకొని వెళ్ళాను..
అక్కడికి వెళ్ళాక తెలిసింది. నేను ఊహించినవన్నీ తప్పులని. అసలు నన్ను అక్కడ ఎవ్వరూ మరిచిపోలేదు.. గత ఆరు సంవత్సరాలుగా వారికి నేను కనపడకపోయినా గానీ నన్ను ,నా పేరును మరిచిపోలేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. అందరు సార్లు పలకరించారు. చివరకి మా సెక్షన్ కు ఎప్పుడూ పాఠాలు చెప్పడానికి రానీ కోటయ్య సార్ కు కూడా నాపేరు జ్ఞాపకం ఉంది అంటే.. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది అసలు ఏడుపు వచ్చినంత పనైంది... కానీ ఒక్కటే భాద కొందరు సార్లు రిటైర్ అయిపోయారట వాల్లను చూడలేక పోయానే అని..అయినా ఏం పర్వాలేదు మరలా ఇంటికి వెల్లి అందరినీ పలకరిద్దాం అనుకున్నాను.
నాకైతే అక్కడ నుండి రావాలని అనిపించలేదు.. కాలం ఒక ఎనిమిది సంవత్సరాలు వెన్నక్కి వెళ్తే బాగుండేది అనిపించింది..... కానీ ఏం చేస్తాం........అసలు ఈ మాట తలచుకున్నప్పుడల్లా ఏడుపు వస్తూనే ఉంది...
No comments:
Post a Comment