ఏదైనా పొలం వంటివి కొనేటప్పుడు వాటి పత్రాలలో “ నిధి నిక్షేపములతో సహా ” రాయడం గమనించే ఉంటారు అందుకు గల కారణం పై చిన్న కధ............
ద్వాపరయుగంలో... ఒక వ్యక్తికి తన పొలంలో నిధి దొరికింది కానీ, అది తనకు పొలం అమ్మిన వ్యక్తి పూర్వీకులు దాచి ఉంచినది కాబట్టి దానిని అతన్నే తీసుకోమంటాడు. కానీ ఆ రెండవ వ్యక్తి మాత్రం నేను పొలం అమ్మేసాను కాబట్టి అది నీకే చెందుతుంది. నాకు వద్దు అని అంటాడు.. నీదంటే, నీదని వీరిద్దరూ వాదించుకుంటూ తీర్పు చెప్పడానికి ధర్మరాజు వద్దకు వెళ్తారు. అక్కడ కూడా వీరిద్దరూ ఇలా వాదించుకుంటుంటే ధర్మరాజుకు ఏం చేయాలో తోచక ఒక ఆరు నెలలు తరువాత రమ్మని గడువు ఇచ్చాడు..
ఈ ఆరు నెలల సమయంలో కృష్ణ నిర్యాణం జరిగి, ద్వాపరయుగం పోయి కలియుగం ప్రారంభమైంది. గడువు ముగిసింది కనుక వీరిద్దరూ మరలా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏమని వాదించుకుంటున్నారంటే “ఆ నిధి నాదంటే నాది ” అని, చూశారా ద్వాపరయుగానికి, కలియుగానికి ఎంత తేడానో.... ఇక ధర్మరాజు ఏలా తీర్పు చెప్పాలా అని ఆలో చిస్తూ, మీరు మీ తదనంతరం ఈ సంపద ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించాడు. మెదట వ్యక్తి తన కుమార్తెకు అని రెండవ వ్యక్తి తన కొడుకుకు అని చెప్పడు.. ధర్మరాజు హమ్మయ్య అనుకుంటూ... వారిద్దరికీ వివాహం జరిపిస్తే ఆ సంపద అంతా మీ కుటుంబంలోనే ఉంటుంది కదా అనిచెప్పి, వారి పిల్లలిద్దరినీ పిలిచి వివాహం చేసుకుంటారా అని అడగితే వారిద్దరూ ఒప్పుకున్నారు.. సమస్య తీరిపోయింది..
కలియుగం అప్పుడే మెదలైంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా లేనందున సరిపోయింది...లేకపోతే
“మా వివాహాలు నిర్ణయించడానికి నువ్వెవరు పో పో” అనే వారేమో కదా.......ఇప్పుడైతే కచ్చితంగా అలానే అంటారు. అందుకే అప్పటి నుండి ఇలాంటి పరిస్దితి తలెత్తకుండా ఆస్తి పత్రాలలో
“నిధి నిక్షేపములతో సహా ” అని రాయడం మెదలు పెట్టారట..........
బావుందండీ...చిన్న కథ తో పెద్ద తేడా చాలా సులభంగా చెప్పేశారు.
ReplyDeleteధ్యాంక్యూ చిన్నిఆశ గారు..ఏదో నాకు తెలిసింది రాశాను..అంతే...
ReplyDeleteచక్కటి కధను అందించారండి.
ReplyDeleteభూమిలోని సహజవాయువు వంటివి నిధినిక్షేపాల కోవలోకి రావు కాబోలు. ( కాలం మరింత మారింది మరి ).
బాగా చెప్పారు ఆనంద్ గారు.ఇంకొన్నాళ్ళు పోతే ఆ మాటను చేర్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.. (మీరే అన్నారుగా కాలం మరింత మారింది అని).
ReplyDeleteఅప్పటికి కలిప్రభావం ఇంకా ధర్మరాజుకి సోకి ఉండదు, లేకపోతె ఈ నిధి మీ ఇద్దరిదీకాదు, రాజునికనుక నాకేచెందాలి అనిఉండేవాడు, ఇప్పడు మనప్రభుత్వంవారంటిన్నట్లు.
ReplyDelete