అసలు మనుషులు ఇలా ఎందుకు ఉంటారు.... నాకు జీవితం గురించి గానీ మనుషుల మనస్తత్వాల గురించి గానీ ఏమీ తెలియవు కానీ నా ద్రుష్టికి వచ్చిన కొన్ని సంఘటనలు వల్ల ఇలా రాస్తున్నాను..
అసలు మనుషులలో ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. ఒకరితో ఒకలాగా మరొకరితో మరోలాగా ఉంటారు...
ఉదా:- నాకు కొంత మంది ఆర్కుట్ ఫ్రెండ్స్ ఉన్నారు వారి నుండి చాలా కాలం నుండి ఏ విధమైన అప్ డేట్స్ లేక పోతే వారు పాపం వాడడం లేదేమోలే అని అనుకున్నాను... నేను సాధారణంగా అమ్మాయిల ప్రొపైల్స్ జోలికి పోను మెన్నక రోజు ఎందుకో ఒక ప్రొపైల్ విజిట్ చేసినపుడు తెలిసిన నిజమేమిటంటే.... ముందు చెప్పానే వారిలో చాలా మంది ఆర్కుట్ వాడుతూనే ఉన్నారు కానీ...... కేవలం అమ్మాయిల పేర్లు మాత్రమే వెదికి వారి స్కాప్ బుక్కులలో రకరకాల గ్రాఫిక్స్ లతో కూడిన స్కాపులు రాస్తున్నారని... అదేమో మరి అలా రాస్తే వీరికి ఒరిగేదేంటి అని ?
వారికి ఒక్క విషయం అర్దం కావడం లేదు..అలా రాసిన స్కాపుల కింద ఒకచెయ్యి లాంటి సింబల్ ఇలా వస్తుంది చూశారా...(స్కాపర్ 99 లాంటి సైట్స్ నుండి కాపీ చేసిన వాటిలో)
అది ఏం చెప్తుందో మీకు తెలుసా? “ఈ స్కాప్ వీడు రాసాడనుకుంటున్నారేమో కాదు కాదు. ఈ సైట్ నుండి కాపీ చేసాడు ” అని....హహ పాపం పిచ్చి వాళ్ళు కనీసం HTML code కొంచెం సరిచేస్తే అలారాదని కూడా తెలీదేమో?
ఉదా-2:
మా పాపకి మూడు సంవత్సరాలు... నేను ఊరకనే తన పేరు మీద ఒక ఐడీ క్రియేట్ చేసి ఉంచాను... దానిలో ఎవ్వరినీ friends గా చేసుకోలేదు..కానీ నాfriend లో ఒక వ్యక్తి రిక్వస్ట్ ఇవ్వడం వల్ల.....ఆ నా friend డే కదా అని accept చేసాను.... అతను రాసిన స్కాప్స్ చూసి నాకు అయితే మతి చలించి పోయింది..... తనకు అసలు పరిచయం లేని అమ్మాయికి “హాయ్ సుహి బాగున్నావా రా ? ” (ఏదో పది సంవత్సరాల నుండి తెలిసిన వాల్లకు రాసే విధంగా ) ఇదిలా ఉంటే మరో స్కాప్ ఇలా “ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్ ఉంది రా.. చేస్తావా? నా మెబైల్ నం. xxxxxxxx ఇది కాల్ చెయ్యి” అని రాసాడు. అసలు పరిచయం కూడా లేని వాల్లకు మెబైల్ నెంబర్ ఇవ్వవలసిన పనేంటి? అసలు నా friend ఇలాంటి వాడని నేను కలలో కూడా అనుకోలేదు.......
అసలు పర స్త్రీ ని తల్లి లాగా చూడాలి అని మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. నేను అప్పటి నుండి అలానే ఉంటున్నాను ... వీరందరూ ఆ రకంగా ఎందుకు ఉండ లేక పోతున్నారు.... ఏంటో మాయదారి లోకం.....
ammo mee friende alanti vadu ayite meeru inkelanti vaallo!! just kidding :)
ReplyDelete