ముందుమాట: ఈ పోస్ట్ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు.

కొందరైతే దేవున్ని పారివేయలేక అలానే ఇంట్లో ఒకపక్కన ఉంచుకుంటున్నారు. మరికొందరు చెత్తలో పారేస్తున్నారు...మరి ఇన్నాళ్ళు అంత భక్తిగా చూసుకున్న ఆ క్యాలండర్ ను అలా పారేయడం భావ్యమేనంటారా ?
ఒక్కసారి మనసుతో ఆలోచించండి...
నా సలహా మాత్రం మీకు కావాలంటే ఒక దేవుడి ఫోటో కొనుక్కొని ఇంట్లో తగిలించుకోండి.....క్యాలండర్ ను క్యాలండర్ లాగానే వాడడండి....ఎవరైనా అలాంటి క్యాలండర్లు ఇవ్వబోయినా వద్దని చెప్పడానికి ప్రయత్నించండి..
నిజమే. పాడేయాలేము వుంచుకోనూ లేము.. దైవ సంబధమైన పుస్తకాలకి అట్టలుగా వేయడం మా శ్రీమతి పద్ధతి.. అదీ బాగానే వుంటుందేమో కదా?
ReplyDeleteహనుమంతరావు గారు...మీ శ్రీమతి గారి పద్దతికి నా జోహార్లు..మీ సలహా చాలా బాగుంది. కానీ మరీ ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఆపని కుదరదుకదా ?
ReplyDeleteఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://teluguwebmedia.in యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి
ReplyDelete