December 25, 2011

ఆత్మావలోకనం... సమస్యలకు పరిష్కారం



 అసలు సుఖం అంటే ఏంటి దు:ఖం అంటే ఏంటి ?

సుఖం :  మన మనస్సుకు అనిపించింది ఏదైనా అలాగే జరిగితే దాన్నే సుఖం అంటారు...

దు:ఖం:  మీ మనసుకు అనిపించినట్లు జరగలేదా అదే దు:ఖం అంటే.......

అంటే సుఖం, దు:ఖం అనేవి రెండూ కూడానూ మన  మనసు చేసే ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయి....మనం సంతోషం అనుకున్నది వేరొకరి దు:ఖానికి కారణం కావచ్చు....

కాబట్టి  ముందు మన మనస్సును మన అధీనంలో ఉంచుకోగలిగితేచాలు... మీకంతా సంతోషమే.......


      మెన్న నాకో SMS వచ్చింది. " కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకు..... సంతోషం గా ఉన్నప్పుడు ఏవ్వరికీ మాట ఇవ్వద్దు " అని చూడడానికి సింపుల్ గా ఉన్నాగానీ  .దానిలో చెప్పింది మాత్రం అక్షరాల నిజం:  

అసలు కోపం, దు:ఖం, అశాంతి ఇవన్నీ మనిషిలోని బలహీనతలు అని నా ఉద్దేశ్యం. 

అశాంతి కలిగినప్పుడు మౌనం వహిస్తే కొంత ఆవేశం చల్లారుతుంది....
చల్లారిన ఆవేశం వెంట ఆలోచన పెరుగుతుంది...
పరుగెత్తే ఆలోచనలలో ఆత్మావలోకనం చోటుచేసుకుంటుంది....
అందులో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.......

     కాబట్టి ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు కానీ... ఎదుటివారిని దూషించడం కానీ చెయ్యద్దు..ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పే....కోపంలో వివేకాన్ని కోల్పోతాం.... ముందు ఆత్మావలోకనం చేసుకున్నాక  ఏ నిర్ణయం అయినా తీసుకోండి...

     ఎందుకంటే మాట జారితే మరలా వెనక్కి తీసుకోలేం కదా...?




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...