దేవునికి దేవికి తెప్పల కోనెటమ్మ
వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
ధర్మార్థకామ మోక్షతతులు నీ సోపానాలు
ఆర్మిలి నాలుగువేదాలదే నీ దరులు |
నిర్మలపు నీ జలము నిండు సప్తసాగరాలు
కూర్మము నీ లోతు వోకోనేరమ్మా ||
తగిని గంగాది తీర్థమ్ములు నీకడళ్ళు
జగతి దేవతలు నీజల జంతులు |
గగనపు బుణ్యలోకాలు నీదరిమేడలు
మొగినీచుట్టు మాకులు మునులోయమ్మా ||
వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభారము |
యేకడను శ్రీవేంకటెశుడే నీవునికి
దీకొని నీ తీర్థమాడితిమి కావమమ్మా ||
నాకు ఈ సంకీర్తన అంటే ఇష్టం... దీనిలో వినిపించే water sound కోసమే ఎప్పుడూ వింటుంటాను...
ReplyDelete