January 18, 2012

ఇంటర్నెట్ స్పీడ్ లో Kbps కు kBps కు తేడా



మనకు ఇంటర్నెట్ ప్రొవైడర్లు  256 kbps, 1 Mbps కనెక్షన్లు అని  ఇస్తుంటారు..కానీ డౌన్లోడ్ స్పీడ్ మాత్రం అంత ఉండదు... ఎందుకోతెలుసా? 

అసలు విషయం అంతా ఆ 'b' అనే అక్షరంలోనే ఉంది... 


ఒక రూపాయి అని చెప్పినా, వంద పైసలు అని చెప్పినా ఒకటే కదా?   వాళ్ళు ఆ పద్దతి  పాఠిస్తారన్నమాట...



కంప్యూటర్ కమ్యూనికేషన్ అంతా డిజిటల్ గా జరుగుతుంది. అంటే 0 లేక ల రూపంలో అన్నమాట..
ఒక 0 లేదా 1 ని బిట్ అంటారు.  అలాంటి ఎనిమిది బిట్లు కలిస్తే బైట్ అవుతుంది..
1 bit = 0 or 1    దీన్ని ’b' తో సూచిస్తారు..
1 Byte = 8 bits    దీన్ని ’B' తో సూచిస్తారు..


 ఇంటర్నెట్ ప్రొవైడర్లు బిట్స్ రూపంలో  డేటాను లెక్కిస్తారు..దానినే బ్యాండ్ విడ్త్ అని అంటారు... మన కంప్యూటర్ బైట్ రూపంలో మనకు చూపిస్తుందన్నమాట...
అంటే...
256 kbps కనెక్షన్ అంటే   32 kBps   (256/8  = 32) కనెక్షన్ అన్నమాట.. 
512 kbps అంటే 64 kBps కనెక్షన్..
అలాగే 1Mbps అంటే 128 KBPS...  అలా లెక్కించుకోవాలి...

సరే , కనెక్షన్ స్పీడ్ ను bps (బిట్స్ పర్ సెకన్ )  అని కొలుస్తారు..
అలాగే మెమరీని bits గా కొలుస్తారు....

మెమరీ గురించి నాకు తెలిసినవి కొన్ని.....

1 bit = 0 or 1

4 bits  = 1nibble

8 bits =  1 Byte =   2 nibbles

1 kB (kilo Byte)  = 1024 Bytes

1024 KilolByte  = 1 Megabyte

1024 Megabyte  = 1 Gigabyte

1024 Gigabyte  = 1 Terabyte

1024 Terabyte  = 1 Petabyte

1024 Petabyte  = 1 Exabyte

1024 Exabyte  = 1 Zeetabyte

వీటి పక్కన బీపియస్ అని చేర్చుకుంటే కనెక్షన్ స్పీడ్ అవుతుందన్న మాట....

4 comments:

  1. ధ్యాంక్యూ unknown గారు .. రాజేష్ గారు....నాకు తెలిసింది చెప్పనంతే.. ఇది అందరికీ తెలిసిందే...

    ReplyDelete
  2. 1024 zettabyte = 1 yb (yeta byte)

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...