February 29, 2012

PDF పైల్ ను ఏ ఫార్మాట్ కైనా మార్చే Software (49.96$ విలువచేసే software మీకోసం Free గా)


హాయ్, PDF zilla అనే ఈ software తో PDF ఫైల్ ను WORD, Text, SWF , HTML, Images గానీ ఏ ఫార్మాట్ కైనా మార్చుకోవచ్చు.. కేవలం 5.8MB సైజ్ ఉన్న software ఇది.

February 26, 2012

MP3 Files ను కావలసిన Bitrate లోకి మార్చడానికి

ఆడియో పైల్స్  సైజును తగ్గించుకోవడానికి బిట్ రేట్ ను తగ్గించడం ఒక టెక్నిక్ కదా....


మనదగ్గర ఉన్న ఆడియో  ఫైల్స్ ను కావలసిన బిట్ రేట్ లోకి మార్చుకోవడానికి  MP3 Bitrate Changer అనే  ఉచిత software బాగా పనిచేస్తుంది..

దేవుడొక్కడే మఱి జీవులు వేరు -- అన్నమాచార్య సంకీర్తనలు

రాగం: బౌళి
కీర్తన: 334 ; రేకు : 59 
Volume: 15 (ఆధ్యాత్మ సంకీర్తనలు)
Page no: 225
 
దేవుడొక్కడే  మఱి జీవులు వేరు
వావాత తెలిసేది వారి వారి భాగ్యము  ||

పొడమినవారికి పోయినవారికి 
గడియలొక్కటే వారిగతులు వేరు |
బడి పుణ్యములు సేయ పాపములు సేయగ
కడగి కాల మెక్కటే కర్మములేవేరు ||


కాకములు సంచరించె కలహంసలు తిరిగె
ఆకాశమెక్కటే విహారాలు వేరు |
మేకొని యెండలు  కాయ మించి చీకటులు రాయ
లోకపు బయలొక్కటే జోకలే వేరు ||

అట్టే ఏలే రాజులకు నడిగేటి దీనులకు 
పట్టి భూమి ఒక్కటే బాగులు వేరు  |
గుట్టున శ్రీ వేంకటేశు గొలువగ దలచగ
నెట్టిన దేహమెక్కటే నేరుపులే వేరు  ||


గమనిక:  నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య  సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...



February 24, 2012

Internet Banking ఉందా User name కూడా జర జాగ్రత్త (password ఒక్కటే కాదు)


ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో ఈ SBI… ఏదో users కోసం చేస్తున్నాం అనుకుంటుంది... కానీ దానివల్ల వచ్చే అనర్దాలు గుర్తించడంలేదు....

SBI internet banking సైట్‍లో మూడు సార్లు మన పాస్‍వర్డు తప్పుగా ఇస్తే మన అకౌంట్ 24 గంటలు ఇలా లాక్ అయిపోతుంది....

 

Photo లను ఆన్‍లైన్‍లో ReSize చేసుకోవాలంటే

  
   మామూలుగా మనం తీసిన పోటోలు కానివ్వండి.. లేక   ఏదైనా Images కానీ దాదాపు ఎక్కువ resolution లో ఉంటే వాటిని  నేరుగా  బ్లాగులలోకి కానీ , వెబ్ సైట్స్ లోకి కానీ అప్‍లోడ్ చేస్తే లోడింగ్ టైమ్  మరియూ మన స్పేస్ వృధా అవుతుంది కదా... 

ఈ తప్పును ఇలాగే నేర్చుకోవద్దు...





           నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం 
   పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |  
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం 
         నమో నమః శంకరపార్వతీభ్యామ్ ||

February 23, 2012

ఏ Software కైనా Portable application తయారుచేసుకోండిలా.....



Install చెయ్యకుండానే వాడగలిగే software లను Portable applications అంటారు... అలా మనకు Internet లో అనేక రకాలైన పోర్టబుల్ అప్లికేషన్లు లభ్యం అవుతున్నాయి... అసలు మనమే అలాంటివి తయారు చేసుకోవాలి అనుకుంటే ఇలా చెయ్యండి

Gmail లో Future Emails ఇలా పంపండి




Gmail వాడే వారు  future లో పంపవలసిన ఈ మెయిల్స్ ను ముందుగానే  schedule చేసుకోవడానికి   Boomerang వాడడం తెలిసిందే కదా... అలాంటిదే  ఈ Right Inbox అనే  సర్వీస్ కూడా..

సుగ్రీవ నారసింహుని చూడరో వాడె -- అన్నమాచార్య సంకీర్తనలు


రాగం: పాడి
సంకీర్తన-146
volume-4
PageNo-98
ఆధ్యాత్మిక సంకీర్తనలు



Download (GVN Anil Kumar)



సుగ్రీవ నారసింహుని చూడరో వాడె
అగ్రపూజ గొన్నవాడు ఆది సింహము ||

దేవతలు జయవెట్టి దివినుండి పొగడగ
దేవులతో కూడున్నాడు దివ్యసింహము |
భావింప నెట్టనెదుట ప్రహ్లాదుడుండగాను
వేవేలు నవ్వులు నవ్వీ విజయసింహము ||

అసురలను గెలిచి అదె సింహాసనముపై
వెస గొలువున్నాడు వీరసింహము |
పసిడి వర్ణముతోడ బహుదివ్యాయిధాలతో
దెసల వెలుగొందీని ధీరసింహము ||

నానాభరణాలు వెట్టీ నమ్మిన దాసుల నెల్ల
ఆనుకొని రక్షించీ ప్రత్యక్షసింహము |
పూని శ్రీ వేంకటాద్రిని బుదులెల్లా కొలువగా
నానా వరములొసని మానవ సింహము ||

గమనిక:  నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య  సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...



February 22, 2012

సగము మానిసిరూపు సగము మెగపురూపు -- అన్నమాచార్య సంకీర్తనలు

రాగం: నాట
శృంగార కీర్తనలు
Volume-18
Page No-140
సంకీర్తన -209


Download (G Balakrishna Prasad)




సగము మానిసిరూపు సగము మెగపురూపు
అగణిత ప్రతాపపు అహోబళేశుడు ||

గద్దెమీద కూచున్నాడు కంబములో పుట్టినాడు
కొద్దిమీర కడు నవ్వుకొంటానున్నాడు  |
వొద్దనె శ్రీసతి చన్ను లొరయిచున్నవాడు
అద్దివో చూడరమ్మ అహోబలేశుడు ||

పెను మీసాలవాడు పెదపెద గోళ్ళవాడు
ఘనునిగా ప్రహ్లాదుని కాచుకున్నాడు |
మనసిచ్చిన సురలతో మాటలాడుచున్నవాడు
అనుప తేజుడమ్మ అహోబలేశుడు ||

వేవేల చేతులవాడు వెన్నెల ఛాయలవాడు
భావించి కొల్చినవారి పాలిటివాడు |
శ్రీ వేంకటగిరి మీద చేరి భవనాశిదండ
ఆవల నీవల మించె అహోబలేశుడు ||



గమనిక:  నాకు Internet లో లిరిక్స్,ఆడియో కనపడని అన్నమయ్య  సంకీర్తనలను అందించాలని చిన్ని ప్రయత్నం... వీటిని నేనే టైప్ చేసాను కనుక అక్షరదోషాలు ఉంటే క్షమించి తెలియజేయగలరు...

Google తో తమాషాలు -3


క్రిందటి టపాలలో రకరకాల గూగుల్ ట్రిక్స్ గురించి వివరించాను కదా  వాటిని ఇక్కడ చూడగలరు..

Google తో తమాషాలు -1 


Google తో తమాషాలు -2


అలాంటివేఇంకొన్ని

February 21, 2012

పడతులాల సోబాన పాడరమ్మా -- అన్నమాచార్య సంకీర్తనలు

489
రాగం: రామక్రియ

Download  (G. Bala Krishna Prasad Garu)

పడతులాల సోబాన పాడరమ్మా
అడరీ పెండ్లాడీనీ అహోబళేశుడు ||

ఎదురు కొండలమీద ఇందిర తాను కూచుండి
మదనకళలు రేగ మాటలాడి |
పదిలపు చూపులనే బాసికము కట్టుక
అదివో పెండ్లాడీనీ అహోబలేశుడు ||  

కనుసన్నల మెల్లనె కాగిటకి చేరి చేరి
చెనకులనే నవ్వులనే సేసలు చల్లి |
వెనుకొని మోపులను విందులు వెట్టుకొంటాను
అనిశము పెండ్లాడీనీ అహోబలేశుడు ||

సందడింపు వేడుకల సమరతులను గూడి
కందువ పెండ్లి పీటైన గద్దె మీదను |
అందమైన శ్రీ  వేంకటాద్రి గరుడాద్రిని
అందుకొనీ పెండ్లాడీనీ అహోబలేశుడు ||





February 20, 2012

ఇహపరములకును ఏలికవు --అన్నమాచార్య సంకీర్తనలు

రేకు: 1883                                                      
Vol: 22
రాగం: శంకరాభరణం

Download  (G Bala Krishna Prasad)



      ఇహపరములకును ఏలికవు 
      బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||


||   వేయికరంబుల వివిధాయుధంబుల
      దాయల నడచిన దైవమవు |
      నీయందున్నవి నిఖిల జగంబులు
       పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||


|| కదిమి దుష్టులను గతము చేసితివి 
      త్రిదశుల గాచిన దేవుడవు |
      వదల కిందరికి వరములొసంగగ 
      బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||


|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు 
      కావలసినచో కలుగుదువు |
      శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన 
     భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||



February 19, 2012

మీకు ఈ FaceBook shortcuts తెలుసా?


FaceBook వాడే వారికి కొన్ని కీబోర్డు Shortcuts: 

Alt+1: News feed

Alt+2: Your profile

Alt+3:  Friend requests

Alt+4: Messages

Alt+5: Notifications

Alt+6: Account Settings

Alt+7: Privacy Settings

Alt+8: Facebook’s Facebook profile

Alt+9: To Security

Alt+0: Help center




శివరాత్రికి ఈ కోతిపిల్లలా మీరు ఉపవాసం చెయ్యగలరా ?



ముందుగా బ్లాగర్లు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.....  శివరాత్రికి చాలా మంది ఉపవాసం, జాగారం చేస్తుంటారు...
ఉపవాసం అంటే అర్దం తెలుసా? 
ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించడం.... సో... దేవునికి దగ్గరగా నివసించడం అన్నమాట.. మనం కడుపునిండుగా తింటే ఇక దేవునిపై మనసు లగ్నం కాదు కదా అందుకని ఇలా ఉపవాసాలు ప్రవేశపెట్టారు... ఉపవాసంలో  ఆహారం స్వల్పంగా తీసుకోవచ్చు(పాలు, పండ్లు లాంటివి) .....అంతేకానీ మరీ కటిక ఉపవాసాలు చేసినా  మనసు ఆయనపై లగ్నం కాకపోతే మాత్రం  అది బూడిదలో పోసిన పన్నీరే....
శివరాత్రి రోజు ఆ మహాశివుడు మనకు వరాలివ్వడానికి భూమి మీదకు వస్తాడు అని అంటారు.. కాబట్టి ఆయన రాకకోసం మనం వేచి ఉన్నాం అని తెలియజేయడానికి జాగరణ చేస్తాం....
అయ్యో అసలు చెప్పాలనుకుంది ఇది కాదే...........
ఆ.........ఉపవాసం గురించి వెదుకుతుంటే ఈ కధ దొరికింది........ ఈ కధలో కోతిపిల్ల శివరాత్రికి  భలే ఉపవాసం చేసింది లేండి.. తనతో పాటు తన పక్కనున్న అందరి ఉపవాసాన్ని ఎలా భగ్నం చేసిందో తెలుసా ? 
అబ్బా చదువుతుంటే నవ్వుఆగలేదు...  మీరూ ఇక్కడ చదువుకోండి


February 16, 2012

Toolwiz నుండి 9 Free Softwares


Tool wiz అనే సింగపూర్ కు చెందిన సంస్ధ ప్రతి పీసీ యూజర్ కు పనికివచ్చే 9 Free utilities అందిస్తుంది.. ఈ సైట్ నుండి వాటిలో మీకు కావలినవి Download చేసుకోండి...

Virtual Mode లో సిస్టం రన్ చెయ్యడానికి Time Freeze software



కంప్యూటర్‍‍ను Virtual Mode లో రన్‍చేస్తే వైరస్‍లకు గురికాదు. అందుకోసం చాలా మంది Deep Freeze, Returnil system safe వంటి software వాడుతూ ఉంటారు...

Time Freeze అనే ఈ software కూడా అదే పని చేస్తుంది..అందులోనూ ఫ్రీ వేర్.... వాడడం కూడా ఎంతో సులభం... 

దీనిని install చేసాక freeze mode ఆన్ చేసుకుంటే మన కంప్యూటర్ virtual mode లో రన్‍అవుతూ C drive లో చేసిన మార్పులన్నీ ఇక సేవ్ కావు.. సో మన కంప్యూటర్ వైరస్‍ల నుండి రక్షించబడినట్టే.... ఎప్పుడైనా మీరు ఉద్దేశపూర్వకంగా ఏదైనా software install చేసి ఉంటే... Real disk లోకి ఆ ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు...

February 15, 2012

Youtube వీడియోలకు Desktop player

Youtube వీడియోలను Desktop నుండే ప్లే చేసుకోవడానికి ఈ ప్లేయర్....

దీనిలో ప్లే లిస్టులు తయారు చేసుకొని వాటిని డెస్క్ టాప్ నుండే చూసేయచ్చు....

వీడియోలను ఎంతో సులభంగా సెర్చ్ చేసి ప్లే లిస్టులో add చేసుకోవచ్చు.. ఇంకా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి...

official site:   http://www.ytubeplayer.com
 

February 8, 2012

కంప్యూటర్ క్షణాల్లో restore చేసే software... (ROLL BACK)



మామూలుగా సిస్టంలో  ఏదైనా  ప్రాబ్లంస్ వచ్చినప్పుడు  system restore అనే ఆప్షన్ ద్వారా  ఒక రీస్టోర్ పాయింట్ ఎంచుకొని ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంటాం కదా..... కానీ ఆ రీస్టోర్ పాయింట్స్  మనం manual గా కానీ, ఏదైనా critical software కానీ install చేసేటప్పుడు మాత్రమే తీయబడుతాయి..అందులోనూ సిస్టం బూట్ అవ్వలేని పరిస్ధితికి వచ్చినప్పుడు అవి ఎందుకూ పనికి రావు...

Virtual OS లో ఇలా పార్టీషియన్స్ చేసుకోండి. (VMWARE Player)

VM Ware Player లో OS ఇన్‍స్టాల్ చేస్తున్నప్పుడు సామాన్యంగా కొంత డిస్క్ space ను ఎంచుకొని అందులో OS ను install చేసేస్తాం.. అప్పుడు మనకు C Drive మాత్రమే వస్తుంది.. కానీ మీరు దానిలో కూడా ఇంకొన్ని Local Drives ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారనుకోండి.. ఇలా ప్రయత్నించండి..

February 7, 2012

Browsers ను సరిగా అప్‍డేట్ చేస్తుండాలి



Browsers, flash player లను  సరిగా update  చెయ్యకపోతే ఇలా వీడియోలు సరిగా కనపడవు + sequrity పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.. మా ఫ్రెండ్ ఒకతను సరిగా అప్‍డేట్ చెయ్యకపోతే ఇలా అయ్యింది.. చూశారా వీడియోలో సగం నల్లగా కన్పించింది.. తర్వాత నేను అన్ని update సరిచేసాక బాగా  వచ్చేసింది.


Google chrome  ఆటోమాటిక్ గా అప్‍డేట్ అయిపోతుంది.. ఒక వేళ About Google Chrome అని నొక్కినప్పుడు ఇలా ఏదైనా error చూపిస్తే సింపుల్ గా reinstall చేసేయ్యండి...
Error మౌస్ తో చూపించాను.

గూగుల్ క్రోమ్ ను ఇంటర్నెట్ లేని కంప్యూటర్స్ లో ఇన్‍స్టాల్ చెయ్యాలంటే ఈ లింకునుండి Download చేసుకోండి..

February 5, 2012

పిల్లల్లో ఊహా శక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్....

    
నేటి ఇంటెర్నెట్ యుగంలో పిల్లలు కార్టూన్ లు చూడటనికి తద్వారా దృశ్య మాధ్యమానికి బాగా అలవటుపడిపోతున్నారు.ఏదైన వినటం ..అర్ధం చేసుకోవటం .. ఊహించుకోగలగటం వంటి మంచి అలవాటుని తెలియకుండానే కోల్పోతున్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులలో అన్ని సమస్యల కి ముఖ్య కారణం పక్క వారి సమస్యలను సావధానం గా విని అర్ధం చేసుకోకపోవటమే!!


చదవగానే డిలీట్ అయిపోయే మెసేజ్ పంపాలా?


ఏదైనా సీక్రట్ మెసేజ్  మెయిల్ లో  మీ ఫ్రెండ్స్ కు పంపాలి అనుకోండి... ఇలా చెయ్యండి..

త్యాగరాజ పంచరత్న కృతులు -- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

నాకు బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలంటే ఎంతో ఇష్టం... ఇంట్లో ఉండే పాత క్యాసెట్స్ వెదుకుతూ ఉంటే ఆయన పాడిన త్యాగరాజ పంచరత్నకృతులు దొరికాయి.. అందుకనే వాటిని ఇలా రికార్డ్ చేసి అప్‍లోడ్ చేసాను..లిరిక్స్ కావాలంటే Click here అన్నదానిపై క్లిక్ చెయ్యగలరు..

February 3, 2012

VMWare Player లో Shared Folder క్రియేట్ చెయ్యడం...



ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఇంకో ఆపరేటింగ్ సిస్టంను ఇలా వర్చువల్ గా వాడడానికి  VM Ware Player ని వాడతారని తెలుసుకదా...
WinXP in Win7

అలా మీరు వర్చువల్ OS లు ఉన్నప్పుడు..మీ మెయిన్ కంప్యూటర్ (Host computer) లో  ఉన్న ఏదైనా ఫైల్స్ యాక్సస్ చెయ్యడానికి.. ఇలా చెయ్యండి..

February 2, 2012

VMWare Player లో ఇన్‍స్టలేషన్ పాత్ మార్చుకొని install చేసుకుంటే మంచిది...





ఒక Operating system లో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చెయ్యడానికి చాలామంది VMWare Player వంటివి వాడుతూ ఉంటారు..
కానీ దానిలో Operating system install చేసే సమయంలో చిన్న మెలుకువ పాఠిస్తే... ఎప్పుడైనా Host operating system మార్చుకున్నాకానీ తిరిగి టైం వృధా చేసుకొని ఈ virtual OS లను ఇన్‍స్టాల్ చెయ్యనవసరం ఉండదు..


ఉదా: మీరు XP install చేస్తుంటే దాని పాత్ ని ఇలా వేరే డ్రైవ్ లోకి మార్చుకుంటే... 


ఎప్పుడైనా మీ కంప్యూటర్ OS మార్చుకున్నాక VMware ఇన్‍స్టాల్ చేసి ఇలా Open virtual machine ఆప్షన్ ద్వారా ఆ పాత్ ని ఎంచుకుంటే... 



ఇక తిరిగి  install చెయ్యనవసరం లేదు.. ఇలా హ్యాపీ గా వచ్చేస్తుంది... 

ఒకవేళ మీరు ఇంతకుమునుపే Install చేసుకుని ఉంటే ఆ ఫోల్డర్‍ని వేరే డ్రైవ్ లోకి బ్యాకప్ చేసుకోండి..



Related Posts Plugin for WordPress, Blogger...