Email హ్యాక్ అయితే ఏమవుతుందో నాకు అంతగా తెలీదు.. కానీ తెలిసిన రెండు ముక్కలు రాస్తా...
నా ఫ్రెండ్స్ కొందర్ని అడినప్పుడు ఇలా అన్నారు.... " నా మెయిల్ లో ఏముంటాయి ? తొక్కలో మెయిల్స్ అంతే కదా హ్యాక్ చేస్తే వాడికే టైం వేస్టు.... అది పోతే ఇంకోటి ఓపెన్ చేసుకుంటాను... "
వినడానికి బాగానే ఉంది... కానీ అసలు హ్యాక్ చేసినవాడు ఏం చెయ్యచ్చు.....?
మీరు అనుకుంటారు.. పోతే మెయిల్ ఐడీ యే కదా అని.... అదే కాదు మీకు సంబంధించిన అన్నీ అకౌంట్లు మీరు కోల్పోయినట్టే... ఎలా అంటారా ? పూర్తిగా చదివితే అర్దం అవుతుంది..
గూగుల్ అకౌంట్ తీసుకుంటే మెయిల్ తో పాటు దానికి సంబంధించిన Youtube, Orkut, Google+ , Blogger, Picasa లో ఉన్న మీ ఫోటోలు.. ఇంకా అన్ని గూగుల్ ప్రోడస్ట్స్ వాడికి ఇచ్చేసినట్టే..... ఆయా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏదైనా చెత్త కంటెంట్ పెడితే మీ ఫ్రెండ్స్ మీరు కాదు అలా చేసింది అంటే నమ్ముతారా ? నమ్మరు.. నానా అవస్ధలు పడాలు ఒప్పించడానికి.... కష్టపడి రాసుకున్న బ్లాగులు పోతాయి.. ఎలా ఉంటుంది అసలు..
మీరు మెయిల్స్ లో చాలా చోట్ల అడ్రస్ ఇచ్చి ఉండచ్చు.. పోన్ నెంబర్లు ఉండచ్చు... వాటి సంగతి ఏంటి ?
ఆ హ్యాకర్ మీ ఐడీ నుండీ ఏదైనా సంఘవిద్రోహ శక్తులకు మెయిల్స్ చేస్తే ప్రభుత్వం నుండి ముప్పు వచ్చేది ఎవరికి ? మీకు కాదా ? నేను ఎక్కడ ఉంటానో ఎలా తెలుస్తుంది అంటారా ? గూగుల్ password recovery కి మెబైల్ నెంబరు ఇచ్చి ఉంటారు..ఇంకెక్కడైనా ఇచ్చే ఉంటారు.... దాని ద్వారా మిమ్మల్ని పోలీసులు పట్టుకోవచ్చు... మీరు ఇవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ లిస్టుద్వారా నైనా(వాళ్ళు ఇచ్చుకోని ఉండచ్చు) , logging locations బట్టి మిమ్మల్ని పట్టుకోవడం పెద్దపనేం కాదు.....
ఇదంతా వదిలేయండి... మెయిల్ కు సంబంధించినవే కాదు .. మిగతా అన్నీ అకౌంట్లు ఫోయినట్టే... అది ఎలా అంటే......
మీకు చాలా సైట్లలో అకౌంట్లు ఉంటాయి... దానిలోకి వెళ్ళి Forgot password అని నొక్కాడు అనుకోండి... reset link మీ email కు వస్తుంది కదా.. సో.... మెయిలే కాదు ఆ సైట్ కూడా హ్యాక్ చేసినట్టేగా ... FaceBook, Twitter, రైల్వే అకౌంట్లు, paypal, DropBox , recharge sites,Bank sites ఒక్కటేంటి ఇంక అన్నీ ఫోయినట్టే..... వాటి ద్వారా ఇంకేమైనా చెయ్యచ్చు.. లేని సైట్లలో రిజిస్టర్ చేసుకొని ఇంకేమైనా చెయ్యచ్చు....
మీరు కాకుండా ఎవరో మీలాగే ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుంది మీకు ? చెప్పండి..... నిద్ర అయినా పడుతుందా ?
కాబట్టి బలమైనా passwords వాడండి.ఎక్కువ special characters వాడండి (@ % ^ & * ! ~ ఇలాంటివి)...... వీలైతే తప్పకుండా two step verification వాడండి.. recovery settings లో మెయిల్ ఐడీ, answers కరెక్టుగా ఇవ్వండి... పోన్ నెంబర్లు అస్సలు వాడద్దు password గా.....
ఇలా చేసుకొని హ్యాపీగా ఉండండి..... కొల్ఫోయ్యాక బాధపడడం కంటే జాగ్రత్త పడడం మేలు...
ఒక మెయిల్ పోతే ఇంకోటి అనే భ్రమలో ఉంటే వెంటనే మారండి... కాదంటారా ?