June 13, 2011

మెయిల్ వస్తే SMS అలర్ట్ ఫ్రీ గా పొందడం


        మనకు ముఖ్యమైన ఈ-మెయిల్స్ వచ్చినపుడు వాటికి త్వరగా స్పందించడానికి, మెయిల్ వస్తే మన మెబైల్ కు SMS వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
దీనికి మీకు కావలిసిందల్లా ఒక way2sms account మాత్రమే... వెంటనే మీ మెబైల్ నెంబరు పై ఆ సైట్ లో ఒక ఉచిత అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
1.       అకౌంట్ లోకి లాగాన్ అయ్యాక Mail alerts అనే option పై క్లిక్ చేయండి.

2.       అక్కడ మీకు ఏ సమయాలలో alerts రావాలో ఎంచుకోండి (బొమ్మ లోని 1 ని చూడండి)...తర్వాత Link Gmail account అనే Option పై క్లిక్ చేయండి (బొమ్మ లోని 2 ని చూడండి)... (ఇక్కడ నేను Gmail ను కాన్పిగర్ చేస్తున్నాను)

3.       అప్పుడు మనకు కనపడే పాప్ అప్ విండోలోని ఐడీని కాపీ చేసుకోండి.

4.       ఇప్పుడు మీ Gmail settings లోని Forward & IMAP section లో మీరు కాపీ చేసి పెట్టుకున్న ఐడీకి మెయిల్ forwarding చెయ్యండి. (కన్పర్మేషన్ కోడ్ మీ మెబైల్ + way2sms లోనూ కనపడుతుంది)

5.       Forwarding  Enable చేసి save changes press చేస్తే చాలు...అయితే keep Gmail’s Copy in inbox అనే option పై చిత్రంలో లాగా సేవ్ చేసుకోవడం మరచిపోవద్దు.

ఇలా చేయడం వల్ల మన మెయిల్ రాగానే మెబైల్ కు ఫలానా వ్యక్తి నుంచి ఈ Subject తో మెయిల్ వచ్చిందని SMS వస్తుంది.....


9 comments:

  1. శ్రీ గారు.. మీ బ్లాగు చాలా బాగుంది. పోస్టుల్లో మీ తపన ప్రతిఫలిస్తోంది. కీపిటప్ మిత్రమా!

    ReplyDelete
  2. శ్రీధర్ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను...ఎందుకంటే నేను మీ వీరాభిమానిని + కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ రీడర్ ని కూడా... అసలు నిజంగా మీరు కామెంట్ రాస్తారని అస్సలు అనుకోలేదు. మెన్న మీరు వెబినార్ లో చెప్పిన విషయం ఎంతో నిజం.. జీవితంలో హ్యాపీనెస్ గురించి + “మనలో ఏదో ఒక్క అవయవం తాత్కాలికంగా పనిచెయ్యలేదని డిప్రషన్ కు లోనై, జీవితంలో క్రుంగి పోకూడదు” అన్న మీ మాటలు నా గుండెను హత్తుకున్నాయి. ఎందుకంటే నా లోని లోపాలను చూసుకోని ఇంతకాలం క్రుంగి పొయ్యేవాడిని.. మీ మాటలు విన్నాక నాకు ఎంతో ధైర్యం లభించింది. ధ్యాంక్యూ అండి నాకు పాజిటివ్ మోటివేషన్ కలిగించినందుకు....

    ReplyDelete
  3. మీ tips చాలా బావున్నాయి.. అందరికి ఉపయోగపడేలా ఇంకా మంచి post లు ఇవ్వండి

    ReplyDelete
  4. ధ్యాంక్యూ విజయమ్మగారు...

    ReplyDelete
  5. Way2sms లో 15 రోజులు మాత్రమే ఉచితంగా మెయిల్ అలర్ట్ అందిస్తున్నారు. Site2sms.com ఉపయొగించ వచ్చు దీనిలో ప్రతి పది రోజులకు మన ఈమేయిల్ ఐడి ఇవ్వవలసి ఉంటుంది

    ReplyDelete
    Replies
    1. రవిగారు ఇప్పుడు అలా ఏం లేదు అండి.. మామూలు గానే ఇక మాటిమాటికి మార్చుకోనవసరం లేదు..ఒక్క సారి activate చేస్తే చాలు...

      Delete
  6. Replies
    1. శ్రీకాంత్ రెడ్డిగారు ధ్యాంక్యూ అండి...

      Delete
  7. శ్రావణ్ గారు ధన్యవాదాలు సార్...

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...