ఈ ఆప్షన్ ద్వారా మన మెయిల్స్ ను వేరే మెయిల్ కు పంపించుకోవచ్చు. దాన్నిమన మెయిల్ అడ్రస్ మార్చుకున్నప్పుడు ఎలా వాడుకోవచ్చో చూడడండి.
ఇంతకు మునుపటి పోస్టులో రెండు జీ-మెయిల్ అకౌంట్లను ఒకటిగా ఎలా వాడుకోవాలోచూశాం. ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల కొత్తగా వేరే మెయిల్ ను క్రియేట్ చేసుకుంటే మీ పాత మెయిల్ కు వచ్చే మెయిల్స్ ను ఈ మెయిల్ నుండే చూసి కొత్తమెయిల్ ద్వారా రిప్లై ఇవ్వవచ్చు. దీనికోసం మీరు మెయిల్ Forwarding అనే దాన్ని ఆక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది.
1. మెదట మీ పాత మెయిల్ ఓపెన్ చేయ్యండి. దానిలోని Forwarding/ IMAP సెట్టింగుల లోకి వెల్లండి
2. అక్కడ add a forwarding address అనే అప్షన్ పై క్లిక్ చెయ్యండి.అప్పుడు వచ్చిన పాప్‍అప్ విండోలో మీ కొత్త మెయిల్ అడ్రస్‍ను ఎంటర్ చెయ్యండి.
3. ఇప్పుడు మీ కొత్త మెయిల్‍కు ఒక ఈ-మెయిల్ వస్తుంది దానిలోకి కోడ్ ను మీ పాత మెయిల్‍లో వెరిఫై చెయ్యవలసి ఉంటుంది.
4. ఇప్పుడు forwarding ను ఎనేబుల్ చేసి సేవ్‍చేంజస్ ను ప్రెస్ చెయ్యవలసి ఉంటుంది.
ఇక్కడ మీ పాత మెయిల్ యెక్క స్టోరేజీ స్పేస్ వేస్టు చెయ్యడం ఇష్టం లేకపోతే delete Gmail’s copy అని ఆప్షన్ సెట్ చెయ్యండి.
ఇకపై మీ పాత మెయిల్ కు వచ్చిన మెయిల్స్ సైతం క్రొత్త మెయిల్ ఇన్ బాక్సుకు వచ్చేస్తాయి...
No comments:
Post a Comment