June 28, 2011

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు--బాలకృష్ణ ప్రసాద్ గారి వీడియోతో

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించిన కొండలలో నెలకొన్న అన్న సంకీర్తనను ఇక్కడ పోస్టుచేస్తున్నాను. బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ సంకీర్తనను గానం చేస్తుండగా తీసిన వీడియోను క్రింద ఉంచాను...ఆ వీడియోను చూస్తూ మీరు సంకీర్తనను ఆశ్వాదించవచ్చు.....









కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు ||

కుమ్మర దాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు ||

అచ్చపు వేడుకతో అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక తిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి  నచ్చినవాడు ||

కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరు-
ణించి తనయెడకు రప్పించిన వాడు
యెంచ నెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు ||


1 comment:

  1. శ్రీ, నా అభిమాన గాయకులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి వీడియోను చక్కని అన్నమాచార్య కీర్తనను పోస్టు చేసినందుకు ధన్యవాదాలు. అయితే చిన్న సవరణలు వున్నాయి. మొదటి చరణం లో "కురువరత్తి నంబి" అనికుంటాను (తి కింద త). రెండవ చరణం మొదటి పంక్తి లో "అచ్చపు వేడుకతో" అని వుండాలి. అన్నమయ్య కీర్తనలు వ్రాయడంలో చాల వరకు "ద్వితీయాక్షర ప్రాస" పాటించాడు. అందువలన మూడవ చరణంలో మొదటి పంక్తి "కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరు" తో అంతమై, రెండవ పంక్తి "ణించి తన యెడకు రప్పించిన వాడు" అని వుండాలి. అందుకే గాయకులు ఈ పంక్తిని "కరు" అని చిన్న పాజ్ ఇచ్చి "ణించి తన యెడకు" అని కొనసాగిస్తారు. ఈ ప్రాస సూత్రం ప్రకారం మూడవ చరణంలో "కంచి", "ణించి", "ఎంచ", "మంచి" వస్తాయి. రెండవ అక్షరం గమనిస్తే "ంచ" యొక్క రూపాంతరం వస్తుంది. మూడవ చరణంలో మూడవ పంక్తిలో "ఎంచనెక్కుడైన" అని వుండాలి.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...