ఆ వేంకటేశ్వరుని లీలలను ఏ మని వర్ణించగలం. ఆయన లీలలు అనంతం. ఈ సంకీర్తనలో స్వామి పాల సముద్రంలో పడుకొని ఉండడం వల్ల నలుపు రంగు అంతా పోయి తెల్లగా మారారని, కానీ మరలా కాళింది నదిలో ఈదడం వల్ల నల్లగా మారారని ఎంతో చమత్కారంగా అన్నమాచార్యుల వారు వర్ణించారు.... జీ. బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన శ్రీ అన్నమాచార్యుల వారి ఏ మని వర్ణించను అన్న సంకీర్తనను ఇక్కడ వీడియోలో వింటూ చదువుకోవచ్చు....
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు |
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ ||
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు |
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ ||
ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
ప : ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి ||
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు |
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ ||
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి ||
చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు |
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ ||
చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు |
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ ||
చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు |
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ ||
chala baga undi song. Thank you
ReplyDelete