June 13, 2011

ఆడియో సీడీలను కాపీ చెయ్యడం

 
     ఆడియో సిడీల రూపంలో ఉన్న పాటలను నేరుగా కాపీ పేస్ట్ చెయ్యడం ద్వారా మన కంప్యూటర్ లోకి సేవ్ చేసుకోవడం సాధ్యం కాదు... మీడియా ప్లేయర్ సాయంతో వాటిని MP3 files గా సేవ్ చేయడం ఇక్కడ వివరిస్తున్నాను..
          ముందుగా మీడియా ప్లేయర్ లోని options ను ఓపెన్ చెయ్యండి. దానిలోని Rip music అనే టాబ్ లోని ఫార్మాట్ ను MP3 file గా సెట్ చేసి కావలిసిన క్వాలిటీని ఎంచుకోని ఓకే ప్రెస్ చెయ్యండి.

      తరువాత ఆడియో సిడిని డ్రైవ్ లో ఉంచి మనకు ఏయే ట్రాకులు కావాలో ఎంచుకొని ఇలా Rip CD అని ప్రెస్ చెయ్యగానే అన్ని పాటలు MP3 file రూపంలో సేవ్ చెయ్యబడుతాయి..  ఇవి default గా My music Folder లో సేవ్ అవుతాయి..మీరు కావాలంటే ఆ పొజిషన్ మార్చుకోవచ్చు..

      అదే xp లోని మీడియా ప్లేయర్ లో options లోని copy music అనే విభాగంలో మనకు ఈ సెట్టింగులు కనపడుతాయి..కానీ దీనిలో మాత్రం పాటలను mp3 files గా సేవ్ చెయ్యలేము. విండోస్ ఆడియో (WMA) ఫైల్ గా మాత్రమే సేవ్ చెయ్యగలం. తర్వాత http://www.wma-mp3.org/ సైట్ లోని ఫ్రీ టూల్ తో MP3 file గా మార్చుకోవచ్చు...
 

2 comments:

  1. You can save directly to MP3 in XP also if you use Windows Media Player 10

    ReplyDelete
  2. శివరామప్రసాదు గారు ధ్యాంక్యూ అండి...మీరు చెప్పింది నిజమే...అంటే నేను XP తో Default గా install అయ్యే Media player 9.0 గురించే ఆలోచించాను..సారీ అండి....

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...